
Vedam Heroine: తెలుగులో చాలా వరకు మల్టీస్టారర్ మూవీస్ వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు తీసే క్రిశ్ 2010లో స్టార్లుగా కొనసాగుతున్న వారందరిలో కలిసి ఓ సినిమా తీశాడు. అదే వేదం. నాలుగైదు కథలను కలిపి ఒకే తెరపై చూపించాలని ఈ ప్రాజెక్టును ఎంచుకున్నాడు. ఇందులో స్టార్ హీరోలు అల్లు అర్జున్, మనోజ్ లతో పాటు అప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క నటించారు. అనుష్క ఇందులో వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా తరువాత అనుష్క ఆల్ రౌండర్ హీరోయిన్ అని అనిపించుకున్నారు. ఇందులో అనుష్కతో పాటు అల్లు అర్జున్ కు జోడిగా దీక్షా సేత్ నటించారు. ఈమె ‘వేదం’ తరువాత పలు సినిమాల్లో నటించారు. కానీ మంచు మనోజ్ పక్కన ఓ భామ నటించింది. ఆమె గుర్తుందా?
ఆమె పేరు లేఖా వాషింగ్టన్. వేదం సినిమాలో మంచు మనోజ్ మ్యూజిషియన్ గా కనిపించాడు. ఆయనకు జోడిగా లేఖా నటించి ఆకట్టుకుంది. కానీ ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. ప్రధానంగా అనుష్క మాత్రమే హైలెట్ అయ్యారు. అయితే లేఖా వాషింగ్టన్ ఈ సినిమాలో నటించిన తరువాత మళ్లీ పెద్దగా పేరు సంపాదించలేదు. అడపాదడపా రెండు, మూడు సినిమాల్లో నటించి బాలీవుడ్ కు వెళ్లింది. చాలా రోజుల తరువాత ఇప్పుడు ఆమె గురించి చర్చించుకుంటున్నారు
చెన్నైలో పుట్టి పెరిగిన లేఖా నాట్య కళాకారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత సినిమాల్లో నటించాలన్న తపన ఉండడంతో ఆమెకు 2008లో ‘జయమకొండాన్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో ఆమె సహాయనటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత ‘వేదం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా యావరేజ్ హిట్టు కొట్టినా పలు అవార్డులు వచ్చాయి. అయితే లేఖకు మాత్రం గుర్తింపు రాలేదు. అయితే వేదం సినిమా తరువాత ‘కమీనా’, ‘డైనమైట్’ అనే డిఫరెంట్ కథతో వచ్చిన చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు.

ఆ తరువాత ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇమ్రాణ్ ఖాన్, అనుష్క శర్మ కలిసి నటించిన ‘మాతృకి బిజిలీ కా మండోలా’ చిత్రంలో కనిపించింది. అయితే అక్కడా అవకాశాలు రాకపోవడంతో పాటు ప్రత్యేక ఇమేజ్ సొంతం కాలేదు. దీంతో ఈమె ‘అజ్జీ’ అనే ప్రొడక్ట్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. అయితే సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం లేఖా యాక్టివ్ గా ఉన్నారు. దీంతో ఆమె గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చించుకుంటున్నారు.