Social Media Addiction: సోషల్ మీడియా.. సోషల్ మీడియా.. సోషల్ మీడియా.. ఇప్పుడు ఎవరి చేతిలో ఫోన్ చూసినా సోషల్ మీడియా నడుస్తూనే ఉంటుంది. ఐదు నిమిషాల సమయం దొరికినా వెంటనే ఫోన్‌లో ఓపెన్ చేసేది సోషల్ మీడియానే. టింగ్ అని ఫోన్ సౌండ్ వచ్చినా.. పని మానేసి మరీ ఫోన్ చూస్తున్నారంటే ఎంతగా ఎడిక్ట్ అయ్యామో చూడండి. ఇంతలా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉండడంతో వాటి ద్వారా ఓవర్‌నైట్ స్టార్ కావడానికి, హీరో అయ్యేందుకు, లైక్స్, షేర్స్ వచ్చేందుకు యువత అనేకరకాలుగా ప్రయత్నిస్తోంది. కొందరు తమకు ఉన్న టాలెంట్‌ను బయటపెడుతుంటే, కొందరు డ్యాన్స్, టిప్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సింగింగ్, కుకింగ్.. ఇలా అనేక రకాల వీడియోస్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో లైక్స్, షేర్స్ పొందుతున్నారు.
యూత్ పాకులాట..
ఇక యూత్ అయితే సోషల్ మీడియాలో షేమస్ కావడానికి, లైక్స్, షేర్స్, కామెంట్స్ రావడానికి అనేక స్టంట్లు వేస్తున్నారు. తమకు అనుభం లేకున్నా, ఎలాంటి మెలకువలు పాటించకుండానే ప్రమాదకరమైన రీతిలో ఫీట్స్ చేస్తున్నారు. మంటల్లో దూకడం, భవనాలపై స్టంట్లు వేయడం, బైక్‌లపై ఫీట్స్ వేయడం, అగ్గిలో నడవడం, ప్రమాదకరమైన జంతువులతో చెలగాలం ఆడడం వంటివి చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రమాదాలబారిన కూడా పడుతున్నారు. మరణించిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఫీట్‌నే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు.
ఇదేం పిచ్చిరా బాబూ..
సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో ఏడుగురు యువకులు మూడు బైక్‌లను రోడ్డపై వరుసగా పెట్టారు. తర్వాత ఆరుగురు ఎంకరేజ్ చేస్తుండగా, ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి.. మూడు బైక్‌లపై నుంచి దూకి రోడ్డపై పడిపోయాడు. ఈ ఘటనలో అతడి ముఖం పూర్తిగా రోడ్డుకు తాకింది. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికే యువకులు ఇలాంటి ఫీట్లు చేస్తున్నారని, ఇవి ఎంత ప్రమాదకరమో గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాణం పోయినా, గాయాలైన పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సోషల్ మీడియా మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం’ అని సజ్జనార్ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. పోతార్రా బాబు.. ఎందుకురా ఇలాంటి పీట్లు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రాణం పోయినా, గాయాలైన పర్వాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫేమస్ కావాలి. ఇదేం పిచ్చో ఏమో. సోషల్ మీడియా మత్తులో పడి ఇలా బంగారు భవిష్యత్ ను యువత నాశనం చేసుకుంటుండటం బాధాకరం. pic.twitter.com/axKflMGRSS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 26, 2024