కరోనా ఒత్తిడిని తట్టుకోలేక మహిళలు ఏం చేస్తున్నారో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఒత్తిడిని పెంచుతోంది. ఇంటికే ఎక్కువగా పరిమితం అవుతున్న మహిళలు వైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలామంది మహిళలు మద్యానికి బానిసలవుతున్నారు. పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు మహిళల్లో ఒత్తిడి పెరగడానికి కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానూ, […]

Written By: Navya, Updated On : October 2, 2020 6:30 am
Follow us on

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఒత్తిడిని పెంచుతోంది. ఇంటికే ఎక్కువగా పరిమితం అవుతున్న మహిళలు వైరస్ తమకు ఎక్కడ సోకుతుందో అని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ మహిళల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చాలామంది మహిళలు మద్యానికి బానిసలవుతున్నారు.

పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధకులు మహిళల్లో ఒత్తిడి పెరగడానికి కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణమైందని వెల్లడిస్తున్నారు. ఉద్యోగం కోల్పోవడం, పిల్లల ఆరోగ్యంపై ఆందోళన, పెరుగుతున్న ఇంటి ఖర్చులు, ఒంటరితనం ఇలా అనేక కారణాలు మహిళల్లో ఒత్తిడి పెరగడానికి కారణమవుతున్నాయి. కరోనా వైరస్ విజృంభించిన రోజు నుంచి మహిళలు మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

సౌత్ ఫ్లోరిడాకు చెందిన ప్రొఫెసర్ లిండ్సే ఎక్కువగా మద్యం సేవించిన మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడించారు. ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్లు, గుండె జబ్బులు, మద్యం సేవించిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ మద్యం సేవించడం వల్ల మహిళల మరణాలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయని తెలిపారు.

విచిత్రం ఏమిటంటే అమెరికాలోని పట్టణ ప్రాంతాలతో పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది మహిళలు మద్యపానం వైపు ఆకర్షితులయ్యారు. అయితే నివేదికలో మహిళలు మద్యం వైపు ఆకర్షితులు కావడానికి కారణాలు తెలియలేదు.