నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా సినిమాల ఫైనల్ రిజల్ట్ ఇదే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల గడిచిన ఆరు నెలలుగా థియేటర్లు మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాలను ఎక్కువగా ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ దూరమైంది. గత నెల తొలివారంలో వి సినిమా విడుదలైనా సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురు చూడగా కొన్ని గంటల వ్యవధిలో ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాప్ సెంటిమెంట్ ను నిజం […]

Written By: Navya, Updated On : October 2, 2020 7:08 am
Follow us on

కరోనా, లాక్ డౌన్ వల్ల గడిచిన ఆరు నెలలుగా థియేటర్లు మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాలను ఎక్కువగా ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ దూరమైంది. గత నెల తొలివారంలో వి సినిమా విడుదలైనా సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురు చూడగా కొన్ని గంటల వ్యవధిలో ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాలు విడుదలయ్యాయి.

అయితే ఈ రెండు సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాప్ సెంటిమెంట్ ను నిజం చేశాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు హిట్ టాక్ రాకపోవడం గమనార్హం. రాజ్ తరుణ్ వరుస ఫ్లాపులకు ఒరేయ్ బుజ్జిగా సినిమాతో బ్రేక్ పడుతుందని భావించినా అతని ఆశలు అడియాశలే అయ్యాయి. రొటీన్ కథ, కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ఇంటర్వెల్ వరకూ బాగానే ఉన్నా సెకండాఫ్ ఫ్లాట్ గా సాగడంతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది.

కామెడీ వీక్ గా ఉండటం సినిమాకు మరో మైనస్ పాయింట్. థియేటర్లో విడుదలై ఉంటే మాత్రం ఈ సినిమాకు భారీగా నష్టాలు వచ్చేవి. ఇక గత కొన్ని రోజులుగా అనుష్క వరుస ప్రమోషన్లతో ఆసక్తి పెంచిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. నటిగా అనుష్క పాత్రకు న్యాయం చేసిన సినిమాలో కథ బాగున్నా కథనంలోని లోపాలు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి.

మిస్టరీ థ్రిల్లర్ గా తెరక్కేన ఈ సినిమాలో థ్రిల్ చేసే సన్నివేశాలే లేకపోవడం గమనార్హం. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో నాచురాలిటీ మిస్ అయింది. దర్శకుడు హేమంత్ మధుకర్ మంచి కథను ఎంచుకున్నా ఆ కథను అద్భుతంగా తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడు. మొత్తానికి ఓటీటీ రిలీజ్ ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాలకు మేలు చేసిందనే చెప్పాలి.