https://oktelugu.com/

చనిపోదామని సముద్రంలో దూకిన మహిళ… రెండేళ్ల తర్వాత..?

కొన్ని సంఘటనలు వినడానికి చిత్రవిచిత్రంగా ఉంటాయి. నమ్మాలని ప్రయత్నించినా నమ్మాలనిపించదు. కానీ ఆ ఘటనలు జరిగాయని తెలియటానికి సాక్ష్యాలు కూడా ఉండటంతో నమ్మక తప్పని పరిస్థితి. తాజాగా ఒక ఘటనలో సముద్రంలో చనిపోవాలని దూకిన మహిళ రెండు సంవత్సరాల తర్వాత నీటిపై తేలియాడుతూ కనిపించింది. దాదాపు 750 రోజుల తర్వాత కూడా మహిళ బ్రతికే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అన్ని రోజులు సముద్రంలో ఆహారం లేకుండా ఆ మహిళ ఎలా జీవించిందో ఎవరికీ అర్థం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 1, 2020 7:41 pm
    Follow us on

    Woman who jumped into the sea to die... two years later?

    కొన్ని సంఘటనలు వినడానికి చిత్రవిచిత్రంగా ఉంటాయి. నమ్మాలని ప్రయత్నించినా నమ్మాలనిపించదు. కానీ ఆ ఘటనలు జరిగాయని తెలియటానికి సాక్ష్యాలు కూడా ఉండటంతో నమ్మక తప్పని పరిస్థితి. తాజాగా ఒక ఘటనలో సముద్రంలో చనిపోవాలని దూకిన మహిళ రెండు సంవత్సరాల తర్వాత నీటిపై తేలియాడుతూ కనిపించింది. దాదాపు 750 రోజుల తర్వాత కూడా మహిళ బ్రతికే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    అన్ని రోజులు సముద్రంలో ఆహారం లేకుండా ఆ మహిళ ఎలా జీవించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కొలంబియాలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఏంజెలికా గైటన్ అనే 46 సంవత్సరాల మహిళ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయింది. మహిళ కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంతగానో వెతికించారు. కానీ ఫలితం శూన్యం.

    ఎంత వెతికినా ఆమె ఆచూకీ ఎవరికీ తెలియలేదు. తాజాగా రొలాండో విస్బాల్ అనే జాలరి చేపల కోసం వెతుకుతుండగా సముద్రంలో ఒక మహిళ తేలుతూ కనిపించింది. విస్బాల్ వెంటనే ఆ మహిళను ఎంతో కష్టపడి రక్షించాడు. ఒడ్డుకు తీసుకొచ్చిన తరువాత మహిళ అపస్మారక స్థితి నుంచి లేచి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సముద్రంలో దూకిన తర్వాత స్పృహ కోల్పోయానని ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తనకు తెలియదని చెప్పింది.

    తాను చనిపోవడం ఇష్టం లేక దేవుడు తనకు రెండో జన్మను ఇచ్చాడని… దేవుడు ఇచ్చిన మరో జన్మను తాను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని ఆమె అన్నారు. 20 సంవత్సరాల పాటు భర్త చిత్రహింసలను భరించిన ఏంజెలికా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కొన్ని నెలల పాటు ఆశ్రమంలో ఉండి ఆ తర్వాత సముద్రంలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.