వరంగల్ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు ప్రేమ పేరుతో వంచించాడు. అందమైన అమ్మాయిని బుట్టలో వేశాడు. అనంతరం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 45 రోజులు కాపురం చేశాక ఇప్పుడు మొహం మొత్తేయడంతో ఆ ప్రియరాలిని వద్దంటున్నాడు. ప్రియుడిని నమ్మి సర్వం అర్పించింది. ఇప్పుడు ప్రియుడు వద్దనడంతో రోడ్డున పడింది. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా2లో బాదావత్ అనిల్ కుమార్ ఇంటి ముందు అతడి భార్య స్రవంతి ఆందోళన చేపట్టింది. చౌటపల్లి శివారు లచ్చ తండాకు చెందిన స్రవంతితో ఈ ఏడాది జనవరిలోనే అనిల్ కు ప్రేమ వివాహం చేసుకుంది.

పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 45 రోజులు కాపురం చేసిన అనిల్ కుమార్.. ఇప్పుడు తనను వద్దంటున్నాడని బాధితురాలు స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక గురువారం స్రవంతి తన భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తన భర్తే కావాలంటూ తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులు వేడుకుంది.
నమ్మించి మోసం చేశాడని.. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు 45 రోజులు కాపురం చేసి వద్దంటున్నాడని స్రవంతి వాపోయింది. అతడు తనను స్వీకరించే వరకూ ఇంటి ముందు ధర్నా చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ పడతి చేస్తున్న పోరాటానికి గ్రామస్థులు మద్దతు పలుకుతున్నారు.



