Atal Setu: స్పైడర్ మాన్ తరహాలో క్యాబ్ డ్రైవర్ సాహసం.. మహిళను కాపాడిన తీరు చూస్తే వారెవ్వా అనాల్సిందే..

ముంబై పోలీసులు ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆ దృశ్యాలలో కల్పిస్తున్న మహిళ ముంబైలోని ములుంద్ ప్రాంతానికి చెందింది. ఆమె రైతు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను రిమా ముఖేష్ గా పోలీసులు గుర్తించారు.

Written By: Neelambaram, Updated On : August 17, 2024 6:35 pm

Atal Setu

Follow us on

Atal Setu: అది ముంబైలోని అటల్ సేతు ప్రాంతం.. వచ్చి పోయే వాహనాలతో ఆ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంది. సముద్రంపై నిర్మించిన ఆ బ్రిడ్జిపై ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. వెంటనే స్పందించి ఆమెను కాపాడాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రావడంతో ఆమె బతికి బట్ట కట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ముంబై పోలీసులు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ క్యాబ్ డ్రైవర్ చొరవను కొనియాడుతున్నారు. ఇదే సమయంలో పోలీసులు చూపిన తెగువను ప్రశంసిస్తున్నారు.

ముంబై పోలీసులు ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఆ దృశ్యాలలో కల్పిస్తున్న మహిళ ముంబైలోని ములుంద్ ప్రాంతానికి చెందింది. ఆమె రైతు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను రిమా ముఖేష్ గా పోలీసులు గుర్తించారు. అటల్ సేటు సేఫ్టీ భార్యపై ఆమె కూర్చుని ఉంది. ముందుగా సముద్రంలోకి కొన్ని వస్తువులను విసిరింది. అనంతరం అందులోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని చూసిన క్యాబ్ డ్రైవర్.. ముందుగా జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత చేతుల్ని అందుకున్నాడు. ఆ సమయంలో అటుగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చారు. అక్కడ దృశ్యాలను చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకొని ఆమెను రక్షించారు. డ్రైవర్ అప్రమత్తత, అధికారుల సమర్ధత వల్ల ఆమె ప్రాణాలు దక్కాయి.

ప్రాణాలు తీసుకోవద్దు

గత నెలల కూడా అటల్ సేతు పై ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. అటల్ సేతు వంతెన పై కారును నిలుపదల చేసిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లి వంతెన రైలింగ్ పైకి ఎక్కి.. ఒకసారిగా సముద్రంలోకి దూకాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. రీమా ముఖేష్ వీడియోను షేర్ చేస్తూ ముంబై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్య చేసుకొని నిండు జీవితానికి ముగింపు పలకవద్దని సూచించారు. ప్రాణాలతో ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ముంబై పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో ట్విట్టర్లో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది.

అయితే ఇటీవల అటల్ సేతుపై ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన పెట్రోలింగ్ నిర్వహించాలని ఒక అంచనాకు వచ్చారు.. ఎవరైనా ఈ తరహా ఘటనలకు పాల్పడితే వారిని కాపాడి.. కౌన్సిలింగ్ ఇప్పించాలని భావిస్తున్నారు. ఇదే విషయంపై ముంబై పోలీస్ కమిషనర్ ఒక ఉత్తర్వు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ముంబై నగరానికి చెడ్డ పేరు తీసుకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. పైగా అటల్ సేతు పర్యాటక ప్రాంతంగా మారుతోంది. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు ముంబై పోలీసులు బలమైన అడుగులు వేస్తున్నారు.