Sleeping Problems: నిద్రలేమి వెంటాడుతోందా? 10-3-2-1 రూల్ పాటించండి.. ఫలితం మీరే చూస్తారు

కాఫీ, టీలు అంటే చాలామందికి ప్రీతి. టైమ్‌తో సంబంధం లేకుండా రోజులో ఎన్నిసార్లు తాగుతారో అసలు లెక్క ఉండదు. అయితే వీటిని ఎక్కువగా సమయం, సందర్భం లేకుండా తాగితే నిద్రపై తప్పకుండా ప్రభావం చూపుతాయి.

Written By: Neelambaram, Updated On : August 17, 2024 6:42 pm

Sleeping Problems

Follow us on

Sleeping Problems: జీవనశైలిలో మార్పుల వల్ల చాలామంది ఈమధ్య లేటుగా నిద్రపోతు.. లేటుగా లేస్తున్నారు. ఇలా లేటుగా నిద్రపోవడం వల్ల మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సరిగ్గా నిద్రలేకపోతే రోజంతా చిరాకుగా ఉంటుంది. ఏ పని కూడా సక్రమంగా చేయలేరు. నిద్ర తక్కువైతే నల్లటి వలయాలు, బరువు పెరగడం, తలనొప్పి, కల్లకింద వలయాలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే చర్మం గ్లో కూడా ఉండదు. అయితే ఈరోజుల్లో చాలామంది ఉద్యోగాలు నైట్‌షిఫ్ట్‌లు చేస్తున్నారు. సరిగ్గా ఫుడ్ లేక రాత్రంతా నిద్రలేక పోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అలాగే రోజూ గంటలకొద్ది సిస్టమ్‌ల ముందు కూర్చుంటున్నారు. దీంతో ఆ కంప్యూటర్ల రేస్ ముఖంపై పడి అసలు నిద్ర కూడా పట్టదు. కనీసం వ్యాయామాలు కూడా చేయరు. అలా ఒకే ప్లేస్‌లో కూర్చోని ఉండటం వల్ల ఊబకాయం వంట సమస్యలతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు. మీకు ఈ నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే ఈ రూల్ పాటించండి. తప్పకుండా మీ సమస్య తీరిపోయి రోజూ ఆయిగా నిద్రపోతారు. ఇంతకీ ఆ రూల్ ఏంటో తెలుసుకుందాం.

నిద్రకు 10 గంటల ముందు వీటిని తీసుకోవద్దు
కాఫీ, టీలు అంటే చాలామందికి ప్రీతి. టైమ్‌తో సంబంధం లేకుండా రోజులో ఎన్నిసార్లు తాగుతారో అసలు లెక్క ఉండదు. అయితే వీటిని ఎక్కువగా సమయం, సందర్భం లేకుండా తాగితే నిద్రపై తప్పకుండా ప్రభావం చూపుతాయి. కాఫీ, టీలను నిద్రపోవడానికి 10 గంటల ముందు అసలు తాగకూడదు. వీటిలో ఉండే కెఫిన్ మెదడులోని నిద్రను ప్రోత్సహించే గ్రాహకాలను అడ్డుకుంటాయి. దీంతో మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట టీ, కాఫీలకు కొంచెం దూరంగా ఉండండి.

నిద్రపోవడానికి 3 గంటల ముందు తినవద్దు
పూర్వకాలంలో రాత్రి 7 గంటలకే అందరూ భోజనం చేసేవాళ్లు. కానీ ప్రస్తుతం చాలామంది సమయంతో పని లేకుండా తింటారు. వర్క్ బిజీలో పడి అర్థరాత్రి కూడా తింటున్నారు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి అయితే తినవచ్చు. కానీ రోజూ ఇలాగే తింటే నిద్రలేమికి కారణం అవుతుంది. కాబట్టి నిద్రపోవడానికి 3 గంటల ముందు ఏం తినకుండా ఉండండి. ఇలా చేస్తే మీకు సరైన నిద్ర పడుతుంది. ఏదైనా పని ఉంటే నిద్రకు 3 గంటల ముందే తినడం మంచిది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.

గంట ముందు దూరంగా ఉండండి
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా సోషల్ మీడియాకు బానిస అయ్యారు. టీవీ లేదా మొబైల్ రోజంతా చూస్తూనే ఉంటున్నారు. ఏం పనిచేసిన మొబైల్ తప్పకుండా ఉండాల్సిందే. అయితే నిద్రపోయే ముందు మొబైల్ స్క్రీన్‌కు దూరంగా ఉంటే నిద్రలేమి సమస్యలు రావు. ఇలా చేయకుండా పడుకునే ముందు కూడా మొబైల్ చూస్తే నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి నిద్రకు గంట ముందు మొబైల్ చూడటం మానేయండి. ఇలా చేస్తే రోజూ రాత్రి మీకు ఆయిగా నిద్రపడుతుంది.