Stag Beetle: ఏపీలో కోటి రూపాయల కీటకం.. అసలు ఏంటిది? ఎందుకు అంత డిమాండ్?

అది పురుగే. కానీ వింత పురుగుట. దానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. ఔషధ గుణాలు ఎక్కువట. అందుకే కోటి రూపాయలు పలుకుతుందట. కానీ అది ఎలా అమ్మాలో తెలియడం లేదట. వింతగా ఉంది కదూ ఈ స్టోరీ.

Written By: Dharma, Updated On : August 17, 2024 6:30 pm

Stag Beetle

Follow us on

Stag Beetle: ప్రపంచంలో అరుదైన పక్షులు,జంతువులు ఉంటాయి. అవి ప్రత్యేకతను సంతరించుకుంటాయి.అందుకే వాటికి అంత గుర్తింపు. అటువంటి అరుదైన కీటకం ఒకటి అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. చీడికాడ మండలంలోని కోణంలో ఔషధ గుణాలు కలిగిన స్టాక్ కనిపించింది. ఈ కీటకానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దాదాపు కోటి రూపాయల వరకు పలుకుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ పురుగులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే మాత్రం ఎన్నెన్నో ఔషధ గుణాలు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి కీటకం ఎవరికైనా దొరికితే అదృష్టవంతులే అని చెబుతుంటారు. భారీ వాహన శ్రేణి ధర కంటే ఈ చిన్నపాటి కీటకం ధర అధికంగా ఉంటుందని తెలిసినవారు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో అరుదైన కీటకాల్లో స్టాగ్ బీటిల్ ఒకటి అని నిపుణులు చెబుతుంటారు. ఈ కీటకం ప్రత్యేక రూపంలో ఉంటుంది. ఔషధ తయారీలో దీనిని ఉపయోగిస్తారని చాలామంది చెబుతుంటారు.ఈ కీటకం ధర మనదేశంలోనే కోటి రూపాయలు పలుకుతుందని చెబుతున్నారు. సాధారణంగా ఇది అడవులతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది.ఇతర కీటకాల మాదిరిగానే దీనికి అన్ని చర్యలు ఉంటాయి. కాలినడక, రెక్కల ద్వారా ముందుకు వెళ్తాయి. ఆహార వనరులు, గుడ్లు పెట్టే ప్రదేశాలకు సమీపంలో ఉంటాయి. లార్వా కుళ్ళిన లాగ్లలో ఇది నివసిస్తుంది. ఎక్కువగా చెట్లనుంచి వచ్చే రసాన్ని ఆహారంగా తీసుకుంటాయి.

*నార్త్ ఇండియాలో ఎక్కువగా
ప్రధానంగా ఈ కీటకాలు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆగ్నేయ ఆసియాలోని దట్టమైన ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల అడవులకు చెందినవిగా చెబుతారు. చెట్లతో కూడిన ప్రదేశాలతో పాటు కూలిన చెక్, చెట్ల కొమ్మలలో ఇవి కనిపిస్తాయి. అయితే ఈ కీటకాల్లో మగవాటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ధర కూడా ఎక్కువ పలుకుతుంది.

* ఇలా పోల్చాలి
ఈ కీటకాలను ఇట్టే పోల్చవచ్చు. మగ కీటకాల గూబలు లోతుగా ఉండి.. కొమ్ములు పొడవుగా ఉంటాయి. ఆడ కీటకాలకు గూబలు ఎత్తుగా ఉండి.. కొమ్ములు పొట్టిగా ఉంటాయి. ఆడ కీటకాల కంటే మగవాటిలోనే ఔషధ గుణాలు అధికం. అందుకే దాని ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అరుదైన కీటకాల వివరాలు ప్రసార మాధ్యమాలతో పాటు యూట్యూబ్ లోనే తెలుసుకోవడం తప్ప బయట అవగాహన తక్కువ.

* గిరిజనుడు ఇంటి వద్ద
అయితే తాజాగా కోనాం గ్రామానికి చెందిన చంటి అనే ఆదివాసి గిరిజనుడికి ఈ కీటకం దొరికింది. కొంచెం వింతగా కనిపించడంతో దానిని ఇంటికి తీసుకొచ్చాడు చంటి. స్థానికులు చూసి దానిని స్టాగ్ బీటిల్ గా గుర్తించారు. కానీ ఎవరిని ఆశ్రయించాలో.. ఎవరికి విక్రయించాలో చంటికి తెలియడం లేదు. అందుకే ఆ కీటకాన్ని తన వద్ద ఉంచుకున్నాడు చంటి.