https://oktelugu.com/

18వేల అడుగుల ఎత్తుపై మహిళ ప్రసవం.. చివరికి ?

మారుతున్న కాలంతో పాటే పిల్లల పేర్లు కూడా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి అర్థం వచ్చే భిన్నమైన పేరును పెట్టాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది తమ పిల్లలు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వింత పేర్లు కూడా పెడుతూ ఉంటారు. కరోనా విజృంభించిన తరువాత పుట్టిన పిల్లలకు కరోనా, లాక్ డౌన్ లాంటి పేర్లు పెట్టి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు వార్తల్లో నిలిచేలా చేశారు. Also Read: ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..! […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 15, 2020 8:16 pm
    Follow us on

    మారుతున్న కాలంతో పాటే పిల్లల పేర్లు కూడా మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి అర్థం వచ్చే భిన్నమైన పేరును పెట్టాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది తమ పిల్లలు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వింత పేర్లు కూడా పెడుతూ ఉంటారు. కరోనా విజృంభించిన తరువాత పుట్టిన పిల్లలకు కరోనా, లాక్ డౌన్ లాంటి పేర్లు పెట్టి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు వార్తల్లో నిలిచేలా చేశారు.

    Also Read: ఆ ‘పోలీస్ స్టేషన్’లో పాములే ఖైదీలు..!

    కొంతమంది పిల్లలకు అద్భుతమైన పేర్లు పెట్టాలని ప్రయత్నిస్తే మరికొందరు మాత్రం పిల్లల పేర్లు పెట్టడంలో తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఒక మహిళ తన బిడ్డకు స్కై అనే పేరు పెట్టింది. తాను బిడ్డను నింగిలో ప్రసవించానని అందువల్లే బిడ్డకు స్కై అనే వింత పేరును పెట్టానని మహిళ చెబుతోంది. ఇలాంటి వింత పేరును బిడ్డకు పెట్టిన సదరు మహిళ పేరు చ్రెస్టాల్ హిక్స్. ఈమె అలస్కాలో తన కుటుంబంలో కలిసి జీవనం సాగిస్తున్నారు.

    Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

    చ్రెస్టాల్ హిక్స్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో భూమికి 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఉండటంతో పైలట్ విమానాన్ని సమీపంలోని విమానశ్రయంలో ల్యాండ్ చేయాలని భావించినా అప్పటికే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆమెను పుట్టిన ప్రాంతం గురించి అడిగారు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆమె తను నివాసం ఉండే ఆంకరేజ్‌లోనే బిడ్డను కన్నట్టు ఆమె ఆస్పత్రి వర్గాలకు చెప్పింది. అనంతరం బిడ్డకు స్కై ఐరోన్ హిక్స్ అనే వింత పేరును పెట్టింది.