https://oktelugu.com/

వెంకీ 75వ చిత్రం.. రేసులో ముగ్గురు దర్శకులు

దిగ్గజ నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వెంకటేశ్‌ నట జీవితంలో 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వైవిధ్యమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారి విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోయే స్టార్ హీరోల్లో వెంకీ ఒకడు. కొందరు స్టార్స్‌ మాదిరిగా ఆయన కమర్షియల్‌ సినిమాకే పరిమితం కాలేదు. కథ నచ్చితే తన స్టార్డమ్‌ను పక్కనపెట్టేస్తాడు. పారితోషికం విషయంలోనూ పట్టువిడుస్తాడు. కుర్ర హీరోలతో మల్టీస్టారర్స్‌కూ వెనుకాడడు. మహేశ్‌ బాబుతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 15, 2020 / 05:15 PM IST
    Follow us on


    దిగ్గజ నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వెంకటేశ్‌ నట జీవితంలో 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వైవిధ్యమైన చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా మారి విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోయే స్టార్ హీరోల్లో వెంకీ ఒకడు. కొందరు స్టార్స్‌ మాదిరిగా ఆయన కమర్షియల్‌ సినిమాకే పరిమితం కాలేదు. కథ నచ్చితే తన స్టార్డమ్‌ను పక్కనపెట్టేస్తాడు. పారితోషికం విషయంలోనూ పట్టువిడుస్తాడు. కుర్ర హీరోలతో మల్టీస్టారర్స్‌కూ వెనుకాడడు. మహేశ్‌ బాబుతో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త పంథాకు తెరలేపాడు. వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2’ తో సక్సెస్‌ కొట్టిన వెంకీ ఈ మధ్యే మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘నారప్ప’ సినిమాలో మరో వైవిధ్యమైన గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇది తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అసురన్‌’కు రీమేక్‌. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వి క్రియేషన్స్ బ్యానర్ల కింద దగ్గుబాటి సురేశ్ బాబు, కలైపులి థాను ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

    Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

    ఇది వెంకీకి 74వ చిత్రం. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. దాంతో వెంకీ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. తన 75వ సినిమాను ప్రత్యేకంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. ఈ స్పెషల్ నంబర్ చిత్రంపై తెలుగు పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది. వెంకీ ఎలాంటి కథతో ముందుకొస్తాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. వెంకటేశ్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 75వ సినిమా కోసం ఇప్పటికే ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నారని సమాచారం. పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కిషోర్ తిరుమల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

    ఇప్పటికే కొన్ని కథలు కూడా వెంకీ విన్నాడట. మరి, తన 75వ సినిమా దర్శకత్వ బాధ్యతలను దగ్గుబాటి హీరో ఎవరి చేతుల్లో పెడతాడన్నది ఆసక్తి కరంగా మారింది. దీనిపై కొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కాగా, అల వైకుంఠపురములోతో హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇస్మార్ట్‌ శంకర్ తో మళ్లీ విజయాల బాట పట్టిన పూరి.. విజయ్‌ దేవరకొండతో ఫైటర్ తీస్తున్నాడు.