https://oktelugu.com/

పాపకి పశ్చాత్తాపం ఎక్కువైంది !

తెలుగు యంగ్ బ్యూటీస్ లో ‘పునర్నవి భూపాలం’ కూడా ఒకటి. పున్ను అంటూ తెలుగు కుర్రాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఈ పాపకి కాస్త టెక్కు కూడా ఎక్కువే. అసలు తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందే బిగ్ బాస్ షో. ఇప్పుడు ఆ షో మీద సీరియస్ అవుతుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ షో పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకూ గుర్తింపు తెచ్చుకుని.. చివరికీ బిగ్‌బాస్ షో మీదే సంచలన కామెంట్స్ చేస్తోంది. అయినా […]

Written By:
  • admin
  • , Updated On : August 15, 2020 / 05:40 PM IST
    Follow us on


    తెలుగు యంగ్ బ్యూటీస్ లో ‘పునర్నవి భూపాలం’ కూడా ఒకటి. పున్ను అంటూ తెలుగు కుర్రాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఈ పాపకి కాస్త టెక్కు కూడా ఎక్కువే. అసలు తనను ప్రేక్షకులకు దగ్గర చేసిందే బిగ్ బాస్ షో. ఇప్పుడు ఆ షో మీద సీరియస్ అవుతుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ షో పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతవరకూ గుర్తింపు తెచ్చుకుని.. చివరికీ బిగ్‌బాస్ షో మీదే సంచలన కామెంట్స్ చేస్తోంది. అయినా తనకు ఏదో పెద్ద స్టార్ స్టేటస్‌ ఉన్నట్టు, ఎప్పుడూ స్టార్ హీరోయిన్‌ లా ఫీల్ అయ్యే ఈ పున్ను పాప ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో ఆమెకే క్లారిటీ లేనట్టు కనిపిస్తోంది.

    Also Read: ‘గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

    నిజానికి బిగ్ బాస్ షో కి ముందు ‘పునర్నవి భూపాలం’ అంటే ఎవ్వరికి పెద్దగా తెలియదు. కేవలం బిగ్ బాస్ షో ద్వారానే పునర్నవికి రెట్టింపు ఫాలోయింగ్ అండ్ క్రేజ్‌ వచ్చింది. అలాగే ఈ షో ద్వారానే రాహుల్ సిప్లిగంజ్‌తో రహస్య ప్రేమ బంధం, అలాగే లేడీ మోనార్క్ అనే బిరుదు, సిక్స్ షేడ్స్ అనే మరో పేరు.. ఇలా ఈ బ్యూటీకి ఏవేవే ట్యాగ్ లైన్స్ వచ్చాయనుకోండి. సరే ఏది ఏమైనా బిగ్ బాస్ షోలోకి వెళ్ళి వచ్చాకే ఈ పాపకి సినీ అవకాశాలు పెరిగాయనేది వాస్తవం. తనకు ఇంత మేలు చేసిన షో మీద, ఇప్పుడు తీరిగ్గా సెటైర్ వేస్తోంది. షోలో జరిగేది వేరు అని, బయట చూపించేది వేరు అని.. బిగ్ బాస్‌ అంతా ఫేక్ అని నీతులు చెబుతుంది.

    Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

    అయినా 24 గంటల పాటు లైవ్ లో ఉండే షోలో మొత్తం చూపించలేరు కదా.. కచ్చితంగా షోలో జరిగిన వాటిట్లో వారికి నచ్చినవి, కాస్త ఘాటుగా ఉండేవి మాత్రమే చూపిస్తారనేది ఎవరికైనా తెలిసిందే. కానీ ఈ బ్యూటీ మాత్రం, రోడ్డు మీద అట్టపెట్టెలు పట్టుకోని, వాటి పై బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా కొటేషన్ రాసి అందరికీ చూపిస్తోంది. ఇంతకీ ఆ అట్టపెట్టి మీద ‘బిగ్‌బాస్‌లోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను’ అని ఒకదాని పై రాసి ఉండగా.. ‘బిగ్ బాస్‌లోకి వెళ్లకూడదని’ అని మరో దాని పై రాసి ఉంది. మొత్తానికి పునర్నవిలో పశ్చాత్తాపం ఎక్కువైపోయింది. అమరి అంతగా షోలో ఏం వెలగబెట్టిందో.