Ambedkar Konaseema District: ఇటీవల కాలంలో మనుషుల్లో సహనం నశిస్తోంది. తాము అనుకున్నది చేయడానికే నిర్ణయించుకుంటున్నారు. కాలమేదైనా మనుషుల్లో ప్రవర్తనలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం తన దగ్గరకే రావాలనే ఉద్దేశంతో ఓ మహిళ ప్రియుడి పురుషాంగం కోసిన సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. చెప్పిన మాట వినడం లేదనే కారణంతో ప్రియుడి మర్మాంగం కోసం తన కసి తీర్చుకుంది. తనతో కాకుండా ఇంకా కొందరితో తిరుగుతున్నాడనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ప్రాంతంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కృష్ణ గణేష్ కు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భార్య ఉండగానే అతడు ఈమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వీరి మధ్య సంబంధం సజావుగానే కొనసాగుతోంది. ఇటీవల ఆమెకు అనుమానం కలిగింది. కృష్ణ ఇంకా కొంత మందితో టచ్ లో ఉంటున్నాడని భావించింది. దీంతో నా దగ్గరకు వస్తే వారితో ఉండొద్దని సూచించింది.
ఈ నేపథ్యంలో తన భర్త ఇంట్లో లేడని ఇంటికి రావాలని ప్రియుడికి చెప్పింది. దీంతో అతడు రాగానే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇక మాటామాటా పెరిగింది. తాను చెబుతున్నా నీవు ఎందుకు మాట వినట్లేదని అతడిని గద్దించింది. తాను ఎవరితోనూ తిరగడం లేదని అతడు బుకాయించాడు. ఇక లాభం లేదనుకుని బ్లేడుతో అతడి మర్మాంగంపై దాడికి దిగింది. దీంతో అతడు బయటకు పరుగులు తీశాడు. విషయం కాస్త అందరికి తెలియడంతో వైరల్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

తీవ్ర గాయాలతో కృష్ణ ఆస్పత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కృష్ణ నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. చెప్పిన మాట వినడం లేదనే అక్కసుతో వివాహిత బ్లేడ్ తో దాడికి దిగడం సంచలనం కలిగించింది. దీంతో ఇద్దరి విషయం కాస్త బట్ట బయలు అయింది. ఏదో చేయాలని చూస్తే ఇంకేదో అయిందన్నట్లు అక్రమ సంబంధాలు సక్రమమైనవి కావని తెలిసినా ఎవరు వినడం లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు.