Swiggy In 2022: మన భారతీయులు భోజనప్రియులు. తిండికి మనం ఇచ్చే ప్రాధాన్యం మామూలుది కాదు. అయితే మనలో చాలా మంది మాంసాహార ప్రియులే. దీంతో నాన్ వెజ్ వంటకాలంటే మనకు భలే పసందు. దీంతోనే మన దగ్గర మాంసాహారానికి డిమాండ్ ఎక్కువే. ఈ నేపథ్యంలో స్విగ్లీ వెల్లడించిన జాబితాలో బిర్యానీకి అగ్రతాంబూలం ఇచ్చారు. మన దేశంలో బిర్యానీ ఆర్డర్లు నిమిషానికి 137 (వెజ్, నాన్ వెజ్ కలిపి) ఇస్తున్నారు. బిర్యానీ అంటే మనవారు ఎంత మక్కువ చూపుతున్నారో తెలిసిపోతోంది. మాంసాహారమంటే మనకు ఇష్టం ఎక్కువే. అందుకే దేశంలో నానాటికి మాంసాహార ప్రియుల సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. 2022 సంవత్సరానికి గాను ఫుడ్ ట్రెండ్స్ విడుదల చేసిన జాబితాలో బిర్యానీ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

రెండో వంటకాల్లో మసాలా దోశ నిలిచింది. స్విగ్లీ నుంచి ఆర్డర్ చేసిన టాప్ వంటకాల్లో పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్ టాప్ లిస్టులో నిలిచాయి. బిర్యానీ అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడోసారి. స్విగ్లీ పచారీ సామన్ల విషయంలో బెంగుళూరుకు చెందిన ఓ వినియోగదారుడు స్విగ్లీ ఇన్ స్టామార్ట్ ను వాడి ఏకంగా రూ.16.60 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేశాడు. బెంగుళూరుకే చెందిన మరో కస్టమర్ దీపావళి సందర్భంగా ఏకంా రూ.75,378 ల విలువైన ఆర్డర్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.
మూడో స్థానంలో పూణెకు చెందిన ఓ కంపెనీ యజమాని న స్టాఫ్ మొత్తానికి ఒకేసారి రూ.71 వేల విలువైన బర్గర్లు, ఫ్రెంచ్ ప్రైస్ ఆర్డర్ చేశాడు. చిరుతిళ్ల విషయంలో భారతీయులు సమోసాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో పాటు పాప్ కార్న్, ఫ్రెంచ్ ప్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, హాట్ వింగ్స్, టాకోస్ ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో నిలిచాయి. ఎక్కువగా ఆర్డర్ చేసిన టాప్ 10 స్వీట్ల జాబితాలో గులాబ్ జామూన్, రసమల, చాకో లావా కేక్, రసగుల్లా, చోకో చిప్క్ ఐస్ క్రీం ఉన్నాయి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పెరిగాయి. ఆర్గానిక్ కూరగాయలకు డిమాండ్ పెరిగింది. స్విగ్లీ వెల్లడించిన జాబితాలో ఈ ఏడాది 50 లక్షల కిలోల ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు కొనుగోలు చేశారంటే ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ పెరిగింది. రసాయనాలు వాడిన వాటితో మన శరీర వ్యవస్థ దెబ్బతింటోంది. వైద్యులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. అందుకు ఆర్గానిక్ కూరగాయల ప్రాధాన్యం పెరుగుతోంది. వీటితో మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో మార్పులు వస్తే మనకే మంచిది.