Sobhita Dhulipala Marriage: నాగ చైతన్య రూమార్డ్ లవర్ శోభిత ధూళిపాళ్ల అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. పెళ్లి ఫోటోలు షేర్ చేసి మతి పోగొట్టింది. తెలుగు అమ్మాయి శోభిత బాలీవుడ్ చిత్రాలతో వెండితెరకు పరిచయమయ్యారు. హీరో అడివి శేష్ ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చారు. 2018లో విడుదలైన స్పై థ్రిల్లర్ గూఢచారి మూవీలో అడివి శేష్ కి జంటగా శోభిత నటించారు. గూఢచారి మంచి విజయం సాధించింది. మరోసారి అడివి శేష్ ఆమెకు మేజర్ మూవీలో ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో మేజర్ విజయం సాధించింది. శోభిత లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ ఇటీవల విడుదలై భారీ హిట్ అందుకుంది.

నటిగా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న శోభిత రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా హీరో నాగ చైతన్యతో ఆమె డేటింగ్ చేస్తున్నారన్న వార్త ఆ మధ్య గుప్పు మంది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తరచుగా శోభితను తీసుకొచ్చేవారంటూ ప్రచారం జరిగింది. షాపింగ్స్, లేట్ నైట్ పార్టీలు, డిన్నర్స్ అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలను నాగ చైతన్య పీఆర్ టీమ్ ఖండించారు. శోభిత పరోక్షంగా పరుష పదజాలంతో అలాంటి వార్తలు రాస్తున్న వాళ్లకు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. నిప్పు లేనిదే పొగరాదంటారు. కాబట్టి నాగ చైతన్య-శోభిత మధ్య ఏదో జరిగే ఉంటుందని నమ్మేవారు లేకపోలేదు. అదే సమయంలో ఈ రూమర్స్ వెనుక సమంత ఉన్నారన్న టాక్ వినిపించింది. నాగ చైతన్య వ్యక్తిత్వం దెబ్బతీయడానికి సమంత ఇవన్నీ చేయిస్తున్నారంటూ ఒక వర్గం ఆరోపించింది.

ఈ ఆరోపణలపై సమంత స్పందించడం విశేషం. ‘ఒక అమ్మాయి పై వచ్చే రూమర్స్ నిజాలు. అదే అబ్బాయిపై వస్తే అవి ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లు..’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నాగ చైతన్య-శోభిత రిలేషన్ విషయంలో సందేహాలు ఉండగా… సడన్ గా శోభిత వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేశారు. దుబాయ్ లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. దీంతో అందరూ షాక్ తిన్నారు. అయితే శోభిత ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, అది ఓ ప్రమోషనల్ షూట్ అని తెలిసింది.