https://oktelugu.com/

Director Teja: డైరెక్టర్ తేజ కుటుంబం ఎందుకు రోడ్డున పడింది? అసలేం జరిగింది?

Director Teja: కొత్తవాళ్లతో సినిమా తీయడమంటే సాహసంతో కూడుకున్న పనే. నటనలో అనుభవం లేకపోవడం.. నటులు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో కొత్తవారితో తీసే సినిమా సక్సెస్ అవుతుందో లేదోనని చాలా మంది డైరెక్టర్లు వెనుకాడుతుంటారు. దీంతో పారితోషికం ఎక్కువిచ్చైనా సరే.. స్టార్ హీరోలతో సినిమాలు తీయడానికి రెడీ అవుతారు. కానీ కొత్త నటులతో మ్యాజిక్ చేయొచ్చని, వారితో కూడా సినిమాలు హిట్టు కొట్టొచ్చని డైరెక్టర్ తేజ నిరూపించాడు. ఆయన తీసే సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో హీరోలు, […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 15, 2023 / 03:24 PM IST
    Follow us on

    Director Teja

    Director Teja: కొత్తవాళ్లతో సినిమా తీయడమంటే సాహసంతో కూడుకున్న పనే. నటనలో అనుభవం లేకపోవడం.. నటులు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడంతో కొత్తవారితో తీసే సినిమా సక్సెస్ అవుతుందో లేదోనని చాలా మంది డైరెక్టర్లు వెనుకాడుతుంటారు. దీంతో పారితోషికం ఎక్కువిచ్చైనా సరే.. స్టార్ హీరోలతో సినిమాలు తీయడానికి రెడీ అవుతారు. కానీ కొత్త నటులతో మ్యాజిక్ చేయొచ్చని, వారితో కూడా సినిమాలు హిట్టు కొట్టొచ్చని డైరెక్టర్ తేజ నిరూపించాడు. ఆయన తీసే సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో హీరోలు, హీరోయిన్లు ఆ తరువాత స్టార్లు గా మారారు. కొందరు లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ తేజ పర్సనల్ లైఫ్ మాత్రం కష్టాలతో కూడుకొని ఉంది. ఓ సందర్భంలో ఆయన కుటుంబం రోడ్డున పడింది.

    ధర్మ తేజ అలియాస్ తేజ 1966 ఫిబ్రవరి 22న చెన్నైలో జన్మించారు. 1960 దశకంలో తేజ ఫ్యామిలీ ఆర్థికంగా పురోగతి ఉన్న కుటుంబం. వీరికి మద్రాసులో నాలుగంతస్తుల భవనం ఉండేది. తండ్రి జెబికే చౌదరి కొరియా, జపాన్ దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించేవారు. తేజ తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆయన నాయనమ్మ వద్ద ఉంటూ చదువును కొనసాగించాడు.

    తల్లి మరణం తరువాత తేజకుటుంబం వ్యాపారంలో బాగా దెబ్బతిన్నది. దీంతో వీరి కుటుంబం రోడ్డున పడింది. కొంత మంది బంధువులు తేజను పెంచే బాధ్యతను తీసుకున్నారు. బాబాయ్ ఇంట్లో ఉన్న తేజ చేతి ఖర్చుల కోసం సినిమా కార్యాలయాల్లో పనిచేసేవారు. అలా కొద్దిరోజులు గడిచిన తరువాత దర్శకుడు టి.కృష్ణ ఇతడిని బాగా చూసుకునేవారు. ఈ క్రమంలో తేజను కొంతమంది చాయా గ్రహకుల వ్ద నియమించాడు. అలా కొన్ని రోజుల పాటు పనిచేసిన తేజ రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘రాత్రి’ సినిమాతో చాయా గ్రహకుడిగా మారాడు.

    Director Teja

    మెల్లగా సినీ అనుభవం సంపాదించుకున్న తేజ కొత్తవారితోనే సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారట. అలా 2001లో ఉదయ్ కిరణ్, అనితలతో కలిసి ‘నువ్వు నేను’ సినిమా తీశారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు నంది అవార్డులు కూడా రావడంతో తేజ లైఫ్ మారిపోయింది. ఇన్నాళ్లు పడ్డ కష్టాన్నంతా ఆయన మరిచిపోయారు. ఇదే ఊపుతో జయం, తదితర సినిమాలు తీశారు. అయితే ఇప్పుడున్న పోటీ వాతావరణంలో తేజ తట్టుకోలేకపోయారు. దీంతో ఆయన సినిమాలు మానుకున్నారు. తానుజీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని నటులకు చెబుతూ వారి జీవితాలకు తేజ ఆదర్శంగా మారాడు. కొన్ని సినిమాలో హీరోయిన్లకు కన్నీళ్లు రాకపోతే వారి చెంప పగలగొడుతారనే పేరు తేజకు ఉంది.