Bhairava Dweepam: భైరవ ద్వీపం’ బేతాళ మాంత్రికుడి పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా?

Bhairava Dweepam: పౌరాణిక చిత్రాలకు ఎప్పడూ డిమాండ్ ఉంటుంది. అందుకే నాటి నుంచి నేటి వరకు ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇలాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిన ఏ హీరో వదులుకోలేదు. సీనియర్ ఎన్టీరామారావుకు ‘పాతాళ భైరవి’ అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. ఆ కోవలోనే చాలా మంది స్టార్ నటులకు ఇలాంటి సినిమాలు లైఫ్ నిచ్చాయి. 1994లో వచ్చిన ‘భైరవ ద్వీపం’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ సంవత్సరం […]

Written By: Chai Muchhata, Updated On : April 15, 2023 3:32 pm
Follow us on

Bhairava Dweepam Bethala Mantrikudu

Bhairava Dweepam: పౌరాణిక చిత్రాలకు ఎప్పడూ డిమాండ్ ఉంటుంది. అందుకే నాటి నుంచి నేటి వరకు ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇలాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిన ఏ హీరో వదులుకోలేదు. సీనియర్ ఎన్టీరామారావుకు ‘పాతాళ భైరవి’ అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. ఆ కోవలోనే చాలా మంది స్టార్ నటులకు ఇలాంటి సినిమాలు లైఫ్ నిచ్చాయి. 1994లో వచ్చిన ‘భైరవ ద్వీపం’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజైన ఈ మూవీ ఇటీవలే 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో భేతాళ మాంత్రికుడి పాత్ర కోసం ముందుగా ఓ నటుడిని అనుకున్నారు. కానీ వేరే నటుడిని పెట్టాల్సి వచ్చింది. మరి ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందామా.

జానపద చిత్రాలు తీయడంలో సింగీతం శ్రీనివాసరావు దిట్ట. కథను ఆయనే రచించి డైరెక్షన్ వహించిన ‘భైరవ ద్వీపం’కు బి. వెంకట్రామిరెడ్డి నిర్మాతగా ఉన్నారు. మాదవ పెద్ద సురేష్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కబీర్ లాల్ చాయ గ్రహణం ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో బాలకృష్ణ తో పాటు రోజా, కైకాల సత్యనారాయణ, సంగీత, బాబు మోహన్, కేఆర్ విజయ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు. ఓ మహా రాణిని కాపాడడానికి విజయ్ పాత్రలో బాలకృష్ణ చేసే సాహసం ఆద్యంత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

‘పాతాళ భైరవి’ సినిమా కథ చెప్పగానే బాలకృష్ణ తండ్రి నటించిన ‘పాతాళ భైరవి’ గుర్తుకొచ్చింది. దీంతో ఏమాత్రం కాదనకుండా వెంటనే ఓకే చెప్పాడు. ఇందులో బాలకృష్ణ గూనిలాగా ఉండే వ్యక్తిగా నటించి ఆకట్టుకున్నాడు. అప్పట్లో సినిమాల్లో రోజా హవా సాగుతున్న నేపథ్యంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారు. బాలకృష్ణ తల్లి పాత్రలో కేఆర్ విజయ నటించారు. గిరిబాబు, శుభలేక సుధాకర్ లు హస్యం పండించారు.

RAJ KUMAR

ఇక ఇందులో ప్రధానమైన పాత్ర భేతాల మాంత్రికుడిది. ఈ పాత్ర కోసం ముందుగా ఎస్. వి రంగారావు అయితే బావుండు అని అనుకున్నారట. అలాగే హిందీ నటులైన నానా పటేకర్, అమ్రిష్ పురిలను కూడా పరిశీలించారట. అయితే ఇదే సమయంలో నిర్మాత వెంకట్రామిరెడ్డి మలయాళ మూవీ ‘వియత్నాం కాలనీ’ అనే సినిమాలో రాజ కుమార్ ను చూసి ఇంప్రెస్ అయ్యాడు. దీంతో భేతాళ మాంత్రికుడి పాత్రలో ఆయనను పెడితే బాగుంటుందిన అని డిసైడ్ అయ్యారు. అయితే ఆయనకు సంస్థ పేరు , రంగారావు పేర్లను కలిపి విజయరంగారాజు అనే పేరుతో ఈ సినిమాలో విలన్ గా చూపించారట.