https://oktelugu.com/

Gunasekhar: ఎలాంటి డైరెక్టర్ ఎలా అయిపోయాడు… గుణశేఖర్ అన్నయ్యా, ఇక ఆపేయ్!

Gunasekhar: ఫస్ట్ సినిమాతోనే నంది అవార్డు. ఆ నెక్స్ట్ మూవీతో మరో నంది. మూడో చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డు. నాలుగో చిత్రానికే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం. మహేష్ తో ఇండస్ట్రీ హిట్… ఇది దర్శకుడు గుణశేఖర్ ఇంట్రో. గతమెంతో ఘనం అన్నట్లు ఇదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు ఆయన ఫేట్ తిరగబడింది. సంచలన దర్శకుడిగా ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్ కెరీర్ ముగిసినట్లే అని ఇండస్ట్రీ టాక్. శాకుంతలం మూవీ చూశాక అందరి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 15, 2023 3:20 pm
    Follow us on

    Gunasekhar

    Gunasekhar: ఫస్ట్ సినిమాతోనే నంది అవార్డు. ఆ నెక్స్ట్ మూవీతో మరో నంది. మూడో చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డు. నాలుగో చిత్రానికే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం. మహేష్ తో ఇండస్ట్రీ హిట్… ఇది దర్శకుడు గుణశేఖర్ ఇంట్రో. గతమెంతో ఘనం అన్నట్లు ఇదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు ఆయన ఫేట్ తిరగబడింది. సంచలన దర్శకుడిగా ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్ కెరీర్ ముగిసినట్లే అని ఇండస్ట్రీ టాక్. శాకుంతలం మూవీ చూశాక అందరి అభిప్రాయం ఇదే.

    గుణశేఖర్ ప్యాషన్ ఉన్న డైరెక్టర్. అందుకే ఆచితూచి సినిమాలు చేశాడు. ఆయన మొదటి చిత్రం లాఠీ 1992లో విడుదలైంది. ఈ ముప్పై ఏళ్లలో కేవలం 13 సినిమాలు తీశారు. జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా గుణశేఖర్ కంటే వేగంగా చిత్రాలు చేశారు. బాల రామాయణం మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న గుణశేఖర్… ఫస్ట్ కమర్షియల్ హిట్ ‘చూడాలని ఉంది’. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం 1998లో విడుదలైంది.

    ఇంత పెద్ద హిట్ పడ్డాక ఏ డైరెక్టర్ అయినా మరో స్టార్ హీరోని వెతుక్కుంటారు. ఈయనేమో అనూహ్యంగా జగపతిబాబుతో మనోహరం అనే ప్రయోగం చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. ఇలా కాదని చిరంజీవితో మృగరాజు టైటిల్ తో జంగిల్ అడ్వెంచర్ తెరకెక్కించారు. మృగరాజు నిరాశపరిచింది. అయితే ఒక్కడు మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. గుణ శేఖర్ కెరీర్లో ఒక్కడు పెద్ద హిట్ అలాగే చివరి హిట్ కూడాను.

    Gunasekhar

    ఒక్కడు సక్సెస్ నేపథ్యంలో మహేష్ ఆయనకు వరుస ఆఫర్స్ ఇచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కిన అర్జున్, సైనికుడు… ఒక్కడు దరిదాపుల్లోకి కూడా పోలేదు. అల్లు అర్జున్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ వరుడు డిజాస్టర్ అయ్యింది. రవితేజ నిప్పు మరో ఆణిముత్యం. కలసిరాని కాలంలో భారీ ప్రాజెక్ట్ రుద్రమదేవి చేశాడు. అది హిట్ అంటారు కానీ… కమర్షియల్ గా డబ్బులు వచ్చిన దాఖలు లేవు.

    లేటెస్ట్ మూవీ శాకుంతలం. ప్రేక్షకులు థియేటర్స్ లో నిద్రపోతున్నారని సమాచారం. రెండున్నర గంటల డైలీ సీరియల్ చూడలేం బాబోయ్ అనేస్తున్నారు. అరాకొరా బడ్జెట్ తో, నాశిరకం గ్రాఫిక్స్ తో ఈ తరం ప్రేక్షకులను మెప్పించడం సాధ్యమేనా. శాకుంతలం చిత్రంపై జనాలకు ఏమాత్రం ఆసక్తి లేదు. దీంతో గుణశేఖర్ రిటైర్మెంట్ తీసుకుంటే నిర్మాతలకు మేలన్న మాట వినిపిస్తోంది. రానా హీరోగా హిరణ్య కశిప అనే భారీ ప్రాజెక్ట్ గతంలో ప్రకటించారు. అది ఇక కల్లే…