https://oktelugu.com/

Mangoes: తియ్యని మామిడిపండ్లను ఎలా గుర్తించవచ్చో తెలుసా?

మామిడిపండు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ కోసిన తరువాత తియ్యగా లేకపోతే తినడం ఇష్టపడం. మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విచ్చి చూడ పురుగులుండు అన్నట్లుగా కాయ కోసిన తరువాత దాని

Written By:
  • Srinivas
  • , Updated On : April 28, 2023 10:05 am
    Follow us on

    Mangoes: పండ్లలో రారాజు అంటే మామిడి పండు. దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది. పసుపు పచ్చ రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో మామిడిపండు తినడం వల్ల మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. ఎండాకాలంలో విరివిగా లభించే మామిడి పండు అంటే అందరికి ఇష్టమే. సీజన్ లో దొరికే పండ్లను బాగా తింటేనే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారు వీటిని తినకపోవడమే బెటర్. మిగతా వారు ఎంతైనా తినొచ్చు.

    మామిడిపండు చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ కోసిన తరువాత తియ్యగా లేకపోతే తినడం ఇష్టపడం. మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విచ్చి చూడ పురుగులుండు అన్నట్లుగా కాయ కోసిన తరువాత దాని అసలు రూపం బయటపడుతుంది. పండ్లు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పండ్లు సొంతం చేసుకోవచ్చు. దానికి మనం ఏం చేయాలంటే..

    మామిడి పండ్లు కొనేటప్పుడు దాని తొడిమెను పరిశీలించాలి. తొడిమె చుట్టు భాగం ముడతలు పట్టినట్లుగా ఉంటే అది సహజమైనది. సహజంగా పండిన పండు రుచిగా ఉంటుంది. మామిడి పండు కింది భాగాన్ని పరిశీలిస్తే నలుపు లేదా ముదురు రంగులో ఉంటే అది సహజంగా పండినది కాదని గుర్తించాలి. ఇలాంటి పండు పుల్లగా ఉండొచ్చు. దీని వల్ల సరిగా తినలేం.

    మామిడిపండును నొక్కి చూస్తే కూడా తెలుస్తుంది. మెత్తగా రసంగా ఉంటే సహజమైనదిగా భావించాలి. నొక్కినప్పుడు మెత్తగా సాగితే అది రసాయనాలతో పండించినదిగా తెలుసుకోవాలి. మామిడి పండు వాసన కూడా మనకు తెలుస్తుంది. సహజమైన పండు తియ్యగా వాసన వస్తుంది. సహజమైనది కాకపోతే దాని వాసన తెలియదు. ఇలా జాగ్రత్తలు తీసుకుని మామిడిపండ్లను కొనడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.