
Char Dham Yatra 2023: చార్ ధామ్ యాత్ర చేయడం వల్ల పుణ్యం వస్తుందని నమ్ముతారు. చార్ ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రినాథ్ ఆలయాలు అన్ని ఒకే రాష్ర్టంలో ఉన్నాయి. అందుకేు వీటిని చార్ ధామ్ అని పిలుస్తారు. వీటిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం దక్కుతుందని నమ్మకం. దానికి ఎంతో పెట్టి పుట్టాలి. ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు దేశంతో పాటు విదేశాల్లో కూడా చాలా మంది వస్తుంటారు. దేవుడిని దర్శించుకుని తరిస్తారు.
దేశంలో చార్ ధామ్ యాత్ర చుట్టి రావాలని అందరు ఆశిస్తారు. కానీ ఈ యాత్ర అత్యంత ప్రమాదకరమైనది. రోడ్డు మార్గం కూడా సరిగా ఉండదు. నడిచి వెళ్లాలి. సంప్రదాయం ప్రకారం చార్ ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనదిగా చెబుతుంటారు. ఈ నాలుగు ధామాల యాత్రను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. దీంతో ఆత్మపరిశుద్ధం అవుతుందని నమ్మకం.
బద్రినాథ్ ఆలయం ఆరు నెలలు మూసి ఉంచుతారు. మళ్లీ ఆరు నెలలు తెరుస్తారు. తెరిచిన ఆరునెలల పాటు దర్శించుకునేందుకు అనుమతిస్తారు. ఆ సమయంలోనే తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. ఈ నాలుగు ఆలయాలు హిమాలయాల చెంతనే ఉన్నాయి. స్వర్గం అంటే ఇక్కడే ఉంటుందని నమ్ముతారు. ఈ ఆలయాలను దర్శించడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.

చార్ ధామ్ ఆలయాలు దర్శించాలంటే పర్వతాలు ఎక్కుతూ పోవాలి. ముసలి వారికి సాధ్యం కాదు. సాహసాలతో కూడిన యాత్ర కావడంతో కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. శారీరకంగా మానసికంగా బలమైన సంకల్పం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను పూర్తి చేయాలంటే ఎన్నో మంచి భక్తి భావంతో ఉంటే సరిపోతుంది.
జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చుట్టి రావాలని కోరుకుంటారు. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే తన్మయత్వం చెందుతారు. చార్ ధామ్ యాత్ర చేస్తే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. చార్ ధామ్ యాత్రతో మనకు అన్ని కలిసొస్తాయని విశ్వాసం. దేశంలోని వారే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులు తమ జీవితంలో చార్ ధామ్ సందర్శించి తమ కోరికలు తీర్చమని వేడుకోవాలని భావిస్తుంటారు.