
Shriya Remuneration: శ్రియ శరన్ స్టార్డం పోయి చాలా కాలం అవుతుంది. అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ అనలేం. ఉపేంద్ర, అజయ్ దేవ్ గణ్, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోల పక్కన ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. చెప్పాలంటే వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. అయితే రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో అసలు తగ్గేదేలే అంటుందట. ఓ ఐటెం సాంగ్ కి శ్రియ శరన్(Shriya Saran) ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేశారట. అయితే ఇది పెద్ద మొత్తం కాకపోయినప్పటికీ ఆమెకున్న డిమాండ్ రీత్యా చాలా ఎక్కువ. ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్ కి మూడు నాలుగు కోట్లు తీసుకుంటారు.
సమంత(Samantha) ఊ అంటావా మావా సాంగ్ కోసం భారీ మొత్తంలో తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే శ్రియ కోటి డిమాండ్ చేయడం మాత్రం చాలా ఎక్కువని పరిశ్రమ వర్గాల వాదన. చిరంజీవి(Chiranjeevi) హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్(Bhola Shankar) తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా భోళా శంకర్ ఉండనుంది. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం శ్రియను సంప్రదించారట. అందుకు శ్రియ రెమ్యూనరేషన్ గా అంత అడిగారట.
ఐదు నిమిషాల ఐటెం సాంగ్ కి కోటి అడిగిన శ్రియ దెబ్బకు షాక్ అయ్యారట. గతంలో శ్రియ చిరంజీవికి జంటగా ఠాగూర్ చిత్రం చేశారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చిరంజీవి-శ్రియ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మణిశర్మ సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక అంతా ఓకే అయితే చాలా కాలం తర్వాత శ్రియ-చిరంజీవి కలిసి స్టెప్స్ వేయనున్నారు. శ్రియ ఇటీవల కబ్జ మూవీలో ఉపేంద్రకు జంటగా నటించారు.

మిలీనియం బిగినింగ్ లో శ్రియ స్టార్డమ్ అనుభవించారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, పవన్, ప్రభాస్, మహేష్… ఇలా రెండు తరాల టాప్ స్టార్స్ తో జతకట్టారు. 2018లో శ్రియ తన రష్యన్ ప్రియుడు ఆండ్రూ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. పాప పేరు రాధ. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా పాపను కన్నారు. ప్రెగ్నెన్సీ విషయం దాచిపెట్టారు.