https://oktelugu.com/

భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి అసలు కారణమిదే..?

2020 మార్చి నెల తొలివారం నుంచి భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే భారత్ లో మరణాల సంఖ్యను తగ్గించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. కేంద్రం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ ద్వారా కేసుల సంఖ్యను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 5, 2020 / 03:15 PM IST
    Follow us on

    2020 మార్చి నెల తొలివారం నుంచి భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే భారత్ లో మరణాల సంఖ్యను తగ్గించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది.

    కేంద్రం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ ద్వారా కేసుల సంఖ్యను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుతోందని చెబుతోంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 57 వేల మందికి పరీక్షలు నిర్వహించామని.. దేశంలో ఇప్పటివరకు 7.90 కోట్ల నమూనాలను సేకరించామని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 1,01,782 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

    దేశంలో నమోదైన 65,49,373 కేసులు నమోదు కాగా నమోదైన కేసులతో పోల్చి చూస్తే మరణాల రేటు 1.56 శాతంగా ఉంది. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాలు తక్కువగా నమోదు కావడం శుభపరిణామం.

    అమెరికాలో మాత్రం కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నా కరోనా వైరస్ ప్రభావం పలు రంగాలపై నేటికీ ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే భారత్ లో పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం వచ్చే సంవత్సరం జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేస్తామని చెబుతోంది.