ప్రపంచ దేశాల ప్రజలు 2020 సంవత్సరాన్ని తలుచుకుంటేనే భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంవత్సరం ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. గతంలో ఏ వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందని స్థాయిలో కరోనా వ్యాప్తి చెందడం, మహమ్మారి ధాటికి ప్రజలను కొత్త కష్టాలు చుట్టుముట్టడం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే సమయంలో కన్యాకుమారి తీరంలోని సముద్రమట్టంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రజల్లో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి.
Also Read: భారత్ లో కరోనా మరణాలు తగ్గడానికి అసలు కారణమిదే..?
కన్యాకుమారిలో అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ఒకేచోట కలుస్తాయి. త్రికడలి సంగమంగా పిలిచే ఈ ప్రాంతంలో గురువారం సాయంత్రం సముద్రం ఒక్కసారిగా వెనక్కు వెళ్లింది. మరుసటి రోజు ఉదయానికి సాధారణ స్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రి సమయంలో కూడా ఇదే విధంగా జరిగింది. జాలర్లు 2004 సునామీ సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందని చెబుతున్నారు.
దీంతో సముద్రం అలా వెనక్కు వెళ్లడం సునామీకి సంకేతమా,..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాలర్లు మాట్లాడుతూ పౌర్ణమి, అమవాస్య రోజులలో ఎక్కువగా ఈ విధంగా జరుగుతుందని చెప్పారు. సముద్రమట్టంలోని హెచ్చుతగ్గులు అక్కడి ప్రజలను సైతం తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఆక్కడ సముద్రం వెనక్కు వెళ్లడంతో వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహం రాళ్లగుట్టలు కూడా కనిపించాయి.
Also Read: ఇండియాలో కరోనా తగ్గుముఖం పట్టినట్లేనా..!
ఇప్పటికే దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలను భయపెడుతుంటే సునామీకి సంబంధించిన వార్తలు ప్రజల్లో భయాందోళనను రెట్టింపు చేస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావద్దని అలా ఏం జరగదని సూచనలు చేస్తున్నారు.