Disease X: కరోనా మహమ్మారి ఒక వైపు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంది. రెండేళ్లుగా తన ప్రభావాన్ని చూపిస్తూ జనంతోనే సహవాసం చేస్తోంది. మూడు దశల్లో ముప్పతిప్పలు పెట్టినా ప్రస్తుతం నాలుగో దశ కూడా ప్రారంభించిందని తెలుస్తోంది. అందుకే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రోజువారీ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో మహమ్మారి వైరస్ తన గుప్పిట్లోనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కేసుల సంఖ్య పెరగడంతో ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు.

ఒక పక్క టీకాలు వేస్తున్నా మహమ్మారి మాత్రం తన ప్రతాపం తగ్గించడం లేదు. దీంతోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి మహోత్పాతాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ ఉండగా మరో కొత్త రకం వ్యాధి ఇప్పుడు ప్రజల మీద దాడికి యత్నిస్తోంది. దాని పేరు డిసీజ్ -ఎక్స్ అని తెలుస్తోంది. ఈ వ్యాధి సోకితే కూడా ప్రమాదకరమే. దీంతో ప్రజలు భయపడుతున్నారు. కరోనా వైరస్ తోనే చిక్కుల్లో పడుతున్న నేపథ్యంలో కొత్త రకం వ్యాధి రావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: AP Free Ration: బీజేపీ నేతలకు ఏమైంది.. ఉచిత బియ్యం పంపిణీ నిలిచినా నోరు మెదపరేమీ?
ఈ వ్యాధి అంతుచిక్కని పాథోజన్ వల్ల వ్యాపిస్తుందని తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఎక్స్ అంటే ఏమీ తెలియదని అర్థం అని చెబుతోంది. దీంతో ఈ కొత్త వ్యాధితో ప్రజలు అతలాకుతలం అయ్యే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ వ్యాధి ఎలా సోకుతుందో ఎలా వ్యాపిస్తోందో అనేదానిపై కూడా ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు.

ఇది కూడా అంటు వ్యాధి కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుతో నష్టం కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే డిసీజ్ -ఎక్స్ గురించి తెలుసుకుని ప్రజలు మసలుకోవాలని హితవు పలుకుతున్నారు. కరోనా వైరస్ సృష్టించిన నష్టాన్ని చూశాం కదా. అందుకే దీన్ని కూడా అదే విధంగా భావించి దాని వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవచ్చు. డిసీజ్ -ఎక్స్ వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటే మనం మరింత అప్రమత్తంగా ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read: July 1 Changes: జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివేనా?