Homeఎంటర్టైన్మెంట్Prabhas New Look: ఆ స్టార్స్ పక్కన ప్రభాస్ షాకింగ్ లుకింగ్.. పిక్...

Prabhas New Look: ఆ స్టార్స్ పక్కన ప్రభాస్ షాకింగ్ లుకింగ్.. పిక్ వైరల్ !

Prabhas New Look: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫాంటసీ సైంటిఫిక్ మూవీగా రాబోతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్తగా ఒక అఫీస్ పెట్టాడు. ఈ ‘వైజయంతీ మూవీస్ 2’ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి అమితాబ్ బచ్చన్ తో పాటు నాని మరియు దుల్కర్ సల్మాన్‌ కూడా పాల్గొన్నారు. వీరంతా ప్రభాస్ తో కలిసి ఫోటో కూడా దిగారు.

Prabhas New Look
Prabhas, Amitabh Bachchan, Nani and Dulquer Salmaan

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఫోటోలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ కూడా ఉండటం.. వీరికి తోడు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాని మరియు దుల్కర్ సల్మాన్‌ లు ప్రభాస్ తో కలిసి కనిపించడంతో ఈ పిక్.. స్పెషల్ పిక్ గా నిలిచిపోయింది. మొత్తానికి ఈ ఫోటోలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

Also Read: Krithi Shetty: కిస్ మీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసిన కృతి కుట్టీ !

ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు. వారికీ ఈ పిక్ మంచి ట్రీట్ అనే చెప్పాలి. మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

Prabhas New Look
project-k

అలాగే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.

Also Read:Vadde Naveen Is In Bigg Boss 6: బిగ్ బాస్ 6 లోకి వద్దే నవీన్..ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా??

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version