Pregnant Car China: కార్లకు కడుపొస్తోంది… చైనాలో ఉబ్బిపోతున్నా కార్లు.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌!

కార్లను అందంగా తయారు చేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ మోడళ్లు, రంగులు, డిజైన్లలో తయారు చేస్తాయి. ఇంటీరియర్‌ డిజైన్‌లతో ఆకర్షిస్తాయి. అయితే ఆ దేశంలో మాత్రం కార్లు.. మనుషుల్లా బాన పొట్టతో కనిపిస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : ఆగస్ట్ 14, 2024 12:05 సా.

Pregnant Car China

Follow us on

Pregnant Car China: కారుకు కడుపు ఏంటి అనుకుంటున్నారా.. నిజమేనండి… సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పొటోలు చూస్తే మీరు నిజమే అని అంటారు. కార్ల బ్యానెట్‌ బాన పొట్టలా ఉబ్బి కనిపిస్తున్నాయి. ఈ కార్లు చైనాలో తిరుగుతున్నాయి. వాటిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. చైనా కార్లకు కడుపొచ్చింది అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. అయితే ఇందా కృత్రిమ మేధ(ఏఐ) ఎఫెక్ట్‌ అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. కానీ ఇదంతా వాస్తవమే అంటున్నాయి. చైనా కార్ల తయారీ కంపెనీలు. నాసిరకం కంపెనీలు తయారుచేస్తున్నాయేమో అనుకునేరు. బ్రాండెడ్‌ కంపెనీలు తయారు చేసిన కార్లు కూడా ఇలాగే కనిపిస్తున్నాయ పర్యావరణ మార్పుల కారణంగా ఇలా బానెట్‌లు ఉబ్బిపోతున్నాయట. కార్ల రంగు దెబ్బతినకుండా ఉండడానికి సన్నని వినైల్‌ ఫిల్మ్‌ను పైనుంచి అంటిస్తారు. అందంగా కనిపించడం కోసం వాణిజ్య ప్రకటనల కోసమూ వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ ఫిల్మే ఇప్పుడు కార్లకు బానపొట్ట రావడానికి కారణమవుతుందట.

ఎందుకంటే…
చైనాలో కార్లు తయారు చేసే కంపెనీలు అన్నీ కార్లు అందంగా కనిపించడడానికి వినైల్‌ ఫిల్మ్‌ అంటిస్తున్నాయి. ఇంతకాలం వీటితో ఎలాంటి ప్రభావం, సమస్య లేదు. కానీ వాతావరణంలో జరుగుతున్న మార్పులు కార్లలోనూ మార్పులు తెస్తున్నాయి. మనిషికి మల్లే బానపొట్టలా కనిపించేలా చేస్తున్నాయి. ఎండ వేడికి ఫిల్మ్‌ వెనకాల ఉండే రసాయనం వ్యాకోచిస్తోందట. దీనికారణంగా అది ఏకంగా బానెట్‌నే ఉబ్బేలా చేస్తున్నట్లు గుర్తించారు నిపుణులు. దీనికారణంగానే అన్ని కంపెనీల కార్ల బానెట్‌లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయని తెలిపారు.

అతిగా ఎండలు..
ఇదిలా ఉంటే.. చైనాలో ఈసారి ఎండలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రికార్డుస్థాయిలో వేడి పోరుగుతోంది. ఈ పరిణామాలతోనే కార్ల బానెట్‌లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయని పేఒర్కంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవుతోంది. షాంఘైలో 40 డిగ్రీలు దాటింది. నాణ్యమైన ఫిల్మ్‌ను వాడటంతోపాటు ఎండలో కార్లను ఎక్కువ సేపు ఉంచకుండా ఉంటే కార్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు. ఎండలో ఉంచాల్సి వస్తే కార్లు వేడెక్కకుండా.. వాటిపై కవర్‌ కప్పి ఉంచాలని సూచిస్తున్నారు. ఎండలు తగ్గే వరకూ ఈ పరిస్థితి తప్పదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. చైనాలో ఈ ఏడాది భిన్న వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు అధికంగా కురుస్తోంది. మరికొన్ని ప్రాంతల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ కారణంగా అక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు.