https://oktelugu.com/

Mr Bachchan: మిష్టర్ బచ్చన్ సినిమాలో హైలెట్ అయ్యే అంశాలు ఇవేనా..?

తెలుగులో చాలా మంది స్టార్ డైరక్టర్లు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అయితే ఉంటుంది...ఇక వాళ్ల నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 14, 2024 / 12:12 PM IST

    Mr Bachchan

    Follow us on

    Mr Bachchan: రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు అమాంతం ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో లో ఈ సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోస్ ఈరోజు సాయంత్రం నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు అయితే బయటకి వచ్చాయి. అందులో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందట. ఇక రవితేజ ఇన్కమ్ టాక్స్ రైడ్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ని కూడా ఫస్టాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసి వదిలిపెడతారట. ఇక మొదటి భాగం మొత్తం నవ్వులతో నింపేసినట్టుగా కూడా తెలుస్తుంది.ఇక సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండడమే కాకుండా విలన్ ని హీరో ఎలా ఎదుర్కోబోతున్నాడు అనేది కూడా సెకండ్ హాఫ్ లో హైలైట్ చేసి చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

    మరి మొత్తానికైతే ఈ సినిమా లో ఎలివేషన్స్, ఎమోషన్స్ చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాతో సక్సెస్ ని అందుకుంటే హరీష్ శంకర్ తో పాటు రవితేజ కూడా భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధిస్తే వీళ్ళ కాంబో మీద కూడా మంచి ఇంప్రెషన్ అయితే ఏర్పడుతుంది. గతంలో వచ్చిన మిరపకాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే అంతకు ముందు వచ్చిన షాక్ సినిమాతో వీళ్ళిద్దరికీ పెద్ద షాప్ తగిలినప్పటికీ, మిరపకాయ్ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి వీళ్ళ కాంబినేషన్ కి ఉన్న పవర్ ఏంటో చూపించారు. ఇక మరోసారి అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులందరికీ అమితంగా నచ్చడమే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ హరీష్ శంకర్ మంచి సక్సెస్ లను కనక అందుకున్నట్లైతే తనను ఆపేవారు ఎవరు ఉండరు అనేది మాత్రం చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ రాబోయే సినిమాలతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటే తన మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది…