Viral News: సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తమ టాలెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. కొందరు హెల్త్ టిప్స్ చెబుతుంటే.. కొందరు డాన్స్‌లు, తమలోని ఇతర టాలెంట్ తెలిసేలా స్కిట్‌లు, రీల్స్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, షేర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కొందరైతే చూడడానికి కూడా ఇబ్బందిపడలే కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. టాలెంట్ ప్రదర్శించే మంచి వీడియోలు, ఫొటోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చెత్త వీడియోలపై మండిపడుతుంటారు. తీవ్రమైన కామెంట్లు పనెడుతుంటారు. అయినా ఎవడి పిచ్చి వాడకి ఆనందం అన్నట్లు.. తన సోషల్ మీడియా అకౌంట్ తన ఇష్టం అన్నట్లుగా చాలా మంది వ్యహరిస్తున్నారు. నెటిజల్ల ఆగ్రహాన్ని తిట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక కొందరు రిస్క్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ప్రంపంచానికి తెలియజేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
భయంకరమైన గుహలోకి..
ఇన్‌స్టాగ్రామ్‌లో రిల్స్ కోసం కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్తున్నారు. ఆటీవల ఒక కంటెంట్ క్రియేటర్ చీకటి గుహలోకి వెళ్లాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. అందులో వేల సంఖ్యలో పురుగులు తిరుగుతున్నాయి. అవి గృహ మొత్తం తిరుగుతూ భయంకరమైన వాతావరణం సృష్టించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.
15 వేలకుపైగా వ్యూస్..
ఓల్డ్ హెన్రీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే 15 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో ఒక వ్యక్తి చాలా ఒంటరిగా ఉన్న ఎవరూ లేని ప్రదేశాన్ని అన్వేషించడం మనం చూడవచ్చు. అతను నడుస్తున్న గుహ చాలా చిన్నదిగా చిమ్మ చీకటిగా ఉంది. అందులో మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది. పెద్దపెద్ద కీటకాలు ఎగురుతూ ఉన్నాయి. ఇరుకైన టన్నెల్ లోపలికి వెళ్తుండగా ఒక డెడ్ ఎండ్ కనిపించింది. అది గోడలా అడ్డుపడి ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కొందరు కొత్త అనుభూతి పొందుతున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఫీల్ అవుతున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More