Waltair Veerayya vs Veera Simha Reddy: సంక్రాంతి పండుగ రైతులకు ఎంత పెద్ద పండగో, సినిమాలకు కూడా అలాంటి పండగే..సంక్రాంతి కానుకగా తమ సినిమాలను విడుదల చేసుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు..సంక్రాంతి డేట్ దొరికితే అదృష్టం అన్నట్టు అన్నమాట..అందుకే అగ్ర హీరోలు ఒక్క రోజు గ్యాప్ తో తమ సినిమాలను విడుదల చేసుకుంటూ ఉంటారు..ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు విడుదలయ్యాయి.

బాలయ్య ‘అఖండ’ వంటి సంచలనాత్మక హిట్ తో మంచి ఊపు మీదున్నాడు..కానీ చిరంజీవి మాత్రం రెండు బ్యాక్ 2 బ్యాక్ కమర్షియల్ ఫ్లాప్స్ తో వెనుకపడ్డాడు..బాలయ్య ఊపు ముందు మెగాస్టార్ తట్టుకోలేదంటూ పచ్చ మీడియా చానెల్స్ రుద్దడం ప్రారంభించాయి..మొదటిరోజు థియేటర్స్ కూడా ‘వీర సింహా రెడ్డి’ కి ఎక్కువ కేటాయించారు..రివ్యూస్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ కి చాలా తక్కువ ఇచ్చి మెగాస్టార్ సినిమానే తొక్కేయాలని చూసారు.
కానీ మెగాస్టార్ మాస్ వాటి అన్నిటిని ఎదుర్కొని బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి అందరి నోర్లను మూయించింది..కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం..మరోపక్క ‘వీర సింహా రెడ్డి’ చిత్రం మాత్రం నాలుగు రోజులకు కలిపి కూడా 50 కోట్ల షేర్ వసూళ్ల దగ్గరే ఆగిపోయింది..నిన్న మొన్నటి వరకు బాలయ్య బాబు ముందు చిరంజీవి ని తక్కువ చేసి మాట్లాడినవాళ్ల చేత సలాం కొట్టించేలా చేసింది ఈ చిత్రం.

ఓవర్సీస్ లో కూడా ఈ రెండు చిత్రాలకు మధ్య గ్యాప్ చాలానే ఉంది..వాల్తేరు వీరయ్య చిత్రం మూడు రోజుల్లో అక్కడ 17 లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసి సెన్సేషన్ సృష్టిస్తే ‘వీర సింహా రెడ్డి’ చిత్రం మాత్రం కేవలం 9 లక్షల డాలర్స్ దగ్గరే ఆగిపోయింది..అలా అనకాపల్లి నుండి అమెరికా వరకు ‘వీర సింహా రెడ్డి’ చిత్రం పై ఊహించని భారీ రేంజ్ మార్జిన్ పెట్టింది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం.