Anasuya Bharadwaj: యాంకర్ అనసూయకి జీవితం ఇచ్చిన షో జబర్దస్త్. ఆ కామెడీ షోకి అంతకు ముందు అనసూయ కనీసం ఎవరో కూడా తెలియదు. సదరు షో ఊహించని సక్సెస్ కావడంతో యాంకర్ గా ఉన్న అనసూయ కూడా ఫేమ్ తెచ్చుకుంది. దానికి తోడు మొహమాటం లేకుండా స్కిన్ షో చేయడం ఆమెకు కలిసొచ్చింది. బోల్డ్ యాంకర్ అన్న ఇమేజ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ షోలో అనసూయ జర్నీ ఏళ్ల తరబడి సాగింది. 2013లో జబర్దస్త్ మొదలు కాగా… అనసూయ యాంకర్ గా ఎంపికైంది. మధ్యలో వ్యక్తిగత కారణాలతో ఆమె షో నుండి బ్రేక్ తీసుకున్నారు. దీంతో రష్మీకి ఛాన్స్ వచ్చింది.

ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేయడం వలన అనసూయ రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇతర ఛానల్స్ లో కూడా ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. అనసూయ స్టార్ యాంకర్ అయ్యారు. ఆపై నటి, హీరోయిన్ వరకు ఎదిగారు. అనసూయ తాను ఈ స్థాయికి వెళుతుందని కలలో కూడా ఊహించి ఉండదు. జీవితం అంటే అదే మరి. ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. అనసూయ ప్రస్తుతం డిమాండ్ ఉన్న టాలీవుడ్ యాక్ట్రెస్.
నటి అయ్యాక కూడా అనసూయ జబర్దస్త్ వదల్లేదు. అయితే గత ఏడాది సడన్ గా తన రాజీనామా ప్రకటించింది. త్వరలో షో వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ చంటి, రాఘవ వెళ్లిపోవద్దని బ్రతిమిలాడారు. ఎవరు చెప్పినా అనసూయ వినలేదు. షో నుండి బయటకు వచ్చాక ఆమె కొన్ని కారణాలు తెలియజేశారు. రెండేళ్లుగా జబర్దస్త్ వదిలేయాలని ప్రయత్నం చేస్తున్నాను, అగ్రిమెంట్ ముగియడంతో ఇప్పుడు బయటకు వచ్చేశానని చెప్పారు.

ఈ క్రమంలో అనసూయ ఒక ఆరోపణ కూడా చేశారు. షోలో కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడేవారు. వారి కామెంట్స్, సెటైర్స్ మనసును బాధించేవి అన్నారు. అయితే అది కారణం కాదన్నారు. ఎట్టకేలకు అనసూయ నిర్ణయం వెనుక అసలు కారణం బయటకు వచ్చింది. కేవలం తన కొడుకుల కోసమే అనసూయ జబర్దస్త్ మానేశారట. తమకు టైం కేటాయించాలని ఇద్దరు కుమారులు కోరారట. పిల్లలకంటే సంపాదన ఎక్కువ కాదని అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నారట. మల్లెమాల వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచుతామని చెప్పి ఆపే ప్రయత్నం చేసినా… అనసూయ వెనక్కి తగ్గలేదట.