Toyota Rumion: భారతదేశంలో కార్లు కొనే సమయంలో రకరకాలుగా ఆలోచిస్తారు. కానీ ఎక్కువమంది కుటుంబ ప్రయోజనాల గురించే కారు కొనాలని చూస్తారు. ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి సొంతంగా MPV లేదా SUV కారు ఉండాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలకు చెందిన SUV లను పరిశీలిస్తారు. అయితే ఇప్పటివరకు Maruti Suzuki కంపెనీకి చెందిన 7 సీటర్ కారు ఉమ్మడి కుటుంబానికి అనుగుణంగా ఉండేది. కానీ దీనిని బీట్ చేయడానికి కొత్తగా మరో కారు మార్కెట్లోకి వచ్చింది. ఇది తక్కువ ధరతో అందుబాటులో ఉండడమే కాకుండా.. ప్రయాణం చేయడానికి అనుకూలమైన ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఇది ఏ కారు అంటే?
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
ప్రస్తుతం ఉన్న కార్లలో ఎక్కువగా MPV విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే SUV కారు కొనాలని ఉన్నా కూడా.. ధర చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో Toyota కంపెనీకి చెందిన Rumion బెస్ట్ ఫ్యామిలీ కారుగా ఉంటుంది. ఈ కారులో 1.5 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 103 పవర్ తో పనిచేస్తూ 139 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా మైలేజ్ విషయంలో కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ కు సపోర్ట్ గా ఉండనుంది. లీడర్ ఇంధనానికి ఈ కారు 20.51 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం తో వినియోగదారులను హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మారుతి ఎర్టిగా 20.21 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
టాటా రూమియన్ లవ్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇన్నర్ ఫీచర్ విషయానికి వస్తే రెండు వరుసల సీట్లు ఉండడంతో పాటు బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండనుంది. అన్లాక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ ఉండడంతో డ్రైవర్లకు ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే 12 వోల్ట్ చార్జింగ్ సపోర్టు ఉండనుంది. ఎక్స్టీరియర్ డిజైన్ ప్రీమియం లుక్ ను అందిస్తోంది. దీనికి 15 అంగుళాల స్టీల్ వీల్స్ ఉండనున్నాయి. ఎల్ఈడి హెడ్ లాంప్స్ తో పాటు హలో జన్ హెడ్ లాంప్స్ ఆకట్టుకొని ఉన్నాయి. అలాగే ముందటి భాగంలో క్రోమ్ గ్రిల్, వెనుక భాగంలో ఎల్ఈడి టెయిల్ లాంప్స్ కారుకు అందాన్ని తీసుకొస్తున్నాయి.
ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా వెళ్లే ఈ కారును రూ.9.55 లక్షల ప్రారంభ ధరకే విక్రయిస్తున్నారు. ప్రస్తుత కాలంలో 7 సీటర్ కార్లలో కొన్నిటికి మాత్రమే తక్కువ ధర ఉన్నాయి. అందులో టయోటా కంపెనీకి చెందిన ఈ కారు ఉండడం విశేషం. టయోటా Rumion మొత్తం నాలుగు వేరియంట్లో అందుబాటులో ఉంది.