https://oktelugu.com/

VV Vinayak: అవకాశాలు లేక దర్శకత్వానికి ‘గుడ్ బై’ చెప్పేస్తున్న వీవీ వినాయక్

VV Vinayak: టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో వీవీ వినాయక్ పేరు లేకుండా ఉండదు, మాస్ కి సరికొత్త నిర్వచనం చెప్పిన ఊర మాస్ డైరెక్టర్ ఆయన. ఎన్నో హిట్లు , సూపర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్లు తీసిన వినాయక్ కి ఒక మాస్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీవీ వినాయక్ సినిమా అంటేనే ఒక బ్రాండ్.తొలి సినిమా ‘ఆది’ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ […]

Written By:
  • Vicky
  • , Updated On : April 13, 2023 / 08:09 AM IST
    Follow us on

    VV Vinayak

    VV Vinayak: టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో వీవీ వినాయక్ పేరు లేకుండా ఉండదు, మాస్ కి సరికొత్త నిర్వచనం చెప్పిన ఊర మాస్ డైరెక్టర్ ఆయన. ఎన్నో హిట్లు , సూపర్ హిట్లు మరియు ఇండస్ట్రీ హిట్లు తీసిన వినాయక్ కి ఒక మాస్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీవీ వినాయక్ సినిమా అంటేనే ఒక బ్రాండ్.తొలి సినిమా ‘ఆది’ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టాడు వినాయక్.

    ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డి, దిల్ , ఠాగూర్, బన్నీ , లక్ష్మీ , కృష్ణ , అదుర్స్ , నాయక్, అల్లుడు శీను మరియు ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి అత్యధిక సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ గా వినాయక్ నిలిచాడు. కానీ రీసెంట్ గా ఆయన నుండి వచ్చిన కొన్ని సినిమాలు, వినాయక్ బ్రాండ్ ని మసకబారేలా చేసింది.

    VV Vinayak

    ఖైదీ నెంబర్ 150 సినిమాతో మరో సారి ఇండస్ట్రీ హిట్ కొట్టి మంచి ఫామ్ లోకే వచ్చాడు కానీ, ఆ సినిమా క్రెడిట్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో చేరింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘ఇంటెలిజెంట్’ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.అక్కడి నుండి వినాయక్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈసారి ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకుండా ఒక మంచి కథ దొరికితేనే సినిమా చేద్దామని కసితో ఉన్నాడు వినాయక్.కానీ ఆయన కోరుకున్న సబ్జక్ట్స్ రావడం లేదు. దీనితో బెల్లంకొండా సాయి శ్రీనివాస్ తో తెలుగు లో రాజమౌళి ప్రభాస్ తో చేసిన సూపర్ హిట్ చిత్రం ఛత్రపతి ని హిందీ రీమేక్ చేసాడు.సుమారుగా మూడేళ్ళ నుండి ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది.

    రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఇక దర్శకత్వం కి గుడ్ బై చెప్పబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్, ఇదే కనుక జరిగితే ఆయన అభిమానులు ఎంతలా ఫీల్ అవుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, కావున ఈ వార్త నిజం కాకూడదని కోరుకుందాము.