
Sreeleela: టాలీవుడ్ లో ఈమధ్య ఎక్కడ చూసిన శ్రీలీల జపమే నడుస్తుంది.పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు ఆమెనే హీరోయిన్ గా కావలి, రామ్ మరియు నితిన్ లాంటి హీరోలకు కూడా ఆమెనే కావాలి.చివరికి బాలకృష్ణ మరియు రవితేజ లాంటి సీనియర్ హీరోలకు కూడా శ్రీలీల నే హీరోయిన్ గా కావాలి.ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోపే ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లను బహుశా ఇప్పటి వరకు మనం ఎక్కడా చూసి ఉండము.
అప్పట్లో రంభ కి ఇలాంటి క్రేజ్ ఉండేదట, ఆ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీలీలనే అని అంటున్నారు.ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ కూడా మామూలుది కాదు, అందరిలో హీరోయిన్స్ లో లేనిది ,ఈమెలో ఉన్నది ఏమిటంటే అద్భుతమైన డాన్స్ టాలెంట్.ఈమె ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలైన నిలబడగలుతారా అనే సందేహం రాక తప్పదు.
కేవలం ఈమెకోసమే థియేటర్స్ కి క్యూ కట్టే మాస్ ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.ఉదాహరణకి గత ఏడాది విడుదలైన మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ చిత్రం లో శ్రీలీల డ్యాన్స్ కి థియేటర్స్ లో ఈల కొట్టని ప్రేక్షకుడు అంటూ ఉండదు.అలాంటి స్పార్క్ ఉంది కాబట్టే ఆమెకి నేడు ఇండస్ట్రీ లో ఇంత డిమాండ్ ఉంది.ఈమె ఎంత డబ్బులు డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి నిర్మాతలు ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు, ఇండస్ట్రీ లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈమె తన రెమ్యూనరేషన్ ని గంటల్లో కొలుస్తుందట.

ఒక గంటపాటు ఆమె షూటింగ్ లొకేషన్ లో ఉంటె 5 లక్షల రూపాయిలు ఇవ్వాలట, అలా ఎన్ని గంటలు ఉంటె అన్ని 5 లక్షల రూపాయిలు.ఇంత డిమాండ్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే ఉంది,మరి ఇండస్ట్రీ లో లాంగ్ రన్ ఉండాలంటే ఇలాంటివి బాగా తగ్గించాలని, హిట్స్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సర్వసాధారణం అని, ఫ్లాప్స్ పడినప్పుడు పక్కకి నెట్టేస్తారని విశ్లేషకులు చెప్తున్నారు.