Homeఎంటర్టైన్మెంట్Tollywood young hero banned: యంగ్ హీరో ఫై బ్యాన్ విధించిన టాలీవుడ్..నిర్మాతని మోసం చేయడమే...

Tollywood young hero banned: యంగ్ హీరో ఫై బ్యాన్ విధించిన టాలీవుడ్..నిర్మాతని మోసం చేయడమే కారణమా?

Tollywood young hero banned: నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతమంది యంగ్ హీరోలు చూపిస్తున్న బలుపు, యాటిట్యూడ్ ని కూసి జనాలకే కాదు, నిర్మాతలకు కూడా చాలా చిరాకు కలిగించేలా చేస్తోంది. ఒక్క హిట్ పడగానే తమకు మించిన తోపులు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు అనే రేంజ్ లో కొంతమంది నిర్మాతలతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది నిర్మాతలు చూసి చూడనట్టు వదిలేస్తారు,కానీ కొంతమంది మాత్రం అసలు వదలరు, తోక జాడిస్తే కత్తిరించి చేతిలో పెడుతారు. రీసెంట్ గా ఒక యంగ్ హీరో ఇలాగే తోక జాడిస్తే కత్తిరించి చేతిలో పెట్టాడట ప్రముఖ టాలీవుడ్ స్టార్ నిర్మాత. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం లో హీరో గా నటిస్తూనే, దర్శకత్వం బాధ్యతలు కూడా చేపట్టాడు ఆ యంగ్ హీరో.

12 కోట్ల రూపాయలలో సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తానని నిర్మాతకు మాట ఇచ్చాడు. కానీ అది 25 కోట్ల రూపాయిలను దాటింది. సినిమా ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. హీరో నిర్మాత వద్ద తీసుకుంటున్న డబ్బులకు ఎలాంటి లెక్కలు లేవు. ఖర్చు చేయిస్తున్న బడ్జెట్ అసలు ఔట్పుట్ రూపం లో కనిపించడం లేదు. దీంతో ఆ నిర్మాతకు చిర్రెత్తిపోయింది. అసలు ఏమి సినిమా తీస్తున్నావు నువ్వు , నన్నే మోసం చేస్తావా?, చెప్తా నీ పని వెయిట్ చెయ్యి అంటూ ఫిలిం ఛాంబర్ కి కంప్లైంట్ ఇవ్వడం, దీనిపై సీరియస్ గా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటూ ఆ హీరో పై బ్యాన్ విధించడం వంటివి జరిగిందట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరు ఆ హీరో, ఎవరు ఆ నిర్మాత అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇది కేవలం చిన్న సినిమాల విషయాల్లోనే కాదు, పెద్ద సినిమాల విషయంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్యనే విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలో నిర్మాతని మోసం చేసి భారీ ఎత్తున డబ్బులు దొబ్బేశారనే టాక్ ఇండస్ట్రీ లో పెను సంచలనం రేపింది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో దీనిపై పెద్ద చర్చ నడిచింది. ఇక నేడు ఈ చిన్న సినిమా వ్యవహారం చాలా పెద్దది గా మారింది. దీనికి సదరు హీరో ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నాడు?, నిజంగానే 25 కోట్లు ఆ బడా నిర్మాత నుండి లూటీ చేశాడా?, ఈ వ్యవహారం పై అతని వెర్షన్ ఏమిటి అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version