IPL trophy 2025
IPL trophy 2025 : గత సీజన్లతో పోల్చితే.. ఈసారి సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరుబోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెడుతోంది. వందకు పైగా పార్కులో స్కోర్ నమోదు అవుతున్నది. ఐపీఎల్ లో ఈ తరహా రన్ రేట్ తో పరుగులు రావడం ఇదే మొదటిసారి. మార్చి 22న ఐపీఎల్ 18వ ఎడిషన్ మొదలైంది. చాలా వరకు మ్యాచులు ఉత్కంఠ మధ్య సాగుతున్నాయి. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ అనుభూతిని అభిమానులకు అందిస్తున్నాయి. పవర్ హిట్టర్లు విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో పవర్ ప్లే లోనే స్కోర్ ఏకంగా 70 పరుగులు దాటేస్తోంది.. 10 ఓవర్లు వచ్చేసరికి 100కు పైగా పరుగులు స్కోరు నమోదు అవుతున్నది. గతంలో జరిగిన ఐపిఎల్ లలో ఈ తరహా పరుగులు నమోదు కాలేదు. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ ప్లేయర్లు దూకుడుకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు.. ఓవర్ కు 10.37 రన్ రేట్ తో పరుగులు చేస్తున్నారు. గత ఎడిషన్ తో పోల్చి చూస్తే ఆటగాళ్ల దూకుడు దాదాపు 20% ఎక్కువగా ఉంది. గత సీజన్లో ఇంటెంట్ 32.6% ఉండగా.. ఈసారి అది 54.3 కి పెరిగింది. ప్రతి 3.9 బంతులకు ఒక ఫోర్ వస్తోంది. 9.9 బంతులకు సిక్సర్ లభిస్తుంది. 17వ సీజన్లో 5.3 బంతులకు ఒక ఫోర్ వచ్చేది. 13.7 బంతులకు సిక్సర్ లభించేది. కానీ ఈసారి 10కి పైగా రన్ రేట్ తో జట్లు పరుగులు సాధిస్తున్నాయి.
Also Read : పోలీసుల కనసన్నల్లో ఐపీఎల్ బెట్టింగ్?!
అప్పుడు ఏం జరిగిందంటే
గత సీజన్లో 41 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. వాటిల్లో పదిసార్లు 250+ స్కోర్లు నమోదు అయ్యాయి. పతన ఎడిషన్లో తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ తో ఆకట్టుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు రెండవ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇక విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు 208 రన్స్ చేసింది. ఢిల్లీ ఆటగాడు అశు తోష్ శర్మ (66*) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. లక్నో జట్టుకు ఓటమి తప్పలేదు. పైగా 209 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ జట్టు చివరి వరకు ఆడి చేదించింది. అహ్మదాబాద్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97*), శశాంక్ సింగ్ (44*) విధ్వంసానికి పరాకాష్ట లాగా ఆడారు. తద్వారా పంజాబ్ 243 పరుగులు చేసింది.. సీజన్ మొదలైన కొద్ది రోజులకే హిట్టర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇక తర్వాత మ్యాచ్లలో ఇదే స్థాయిలో ఆడితే మాత్రం 300 స్కోర్ నమోదు కావడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ తాము 300 స్కోర్ చేస్తామని సంకేతాలిచ్చాడు.. అంటే ఈ ఘనతను హైదరాబాద్ జట్టు ముందే సాధిస్తుందేమో చూడాలి మరి.
Also Read : షారుక్ వ్యాఖ్యానం.. శ్రేయ గాత్రం.. దిశా నాట్యం.. అదిరిపోయిన ఆరంభ వేడుకలు..