https://oktelugu.com/

Viral Video : సంప్రదాయిని.. సుద్దపూసని… ఈమె ఆమ్లెట్ చూస్తే నవ్వాగదు.. వీడియో వైరల్

తాను వేసిన ఆమ్లెట్ ను తిరిగేసేందుకు ఏకంగా దారాలను ఉపయోగించింది. చదువుతుంటే నవ్వొస్తుంది కదూ.. కాదు ఆమ్లెట్ పూర్తిగా కాలిన తర్వాత ఆమె ఆ దారాలు విప్పడం విశేషం.

Written By:
  • NARESH
  • , Updated On : February 29, 2024 / 10:05 AM IST
    Follow us on

    Viral Video : చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా ఆమ్లెట్ ఎంచుకుంటారు. ఇంకొందరు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటారు.ఆమ్లెట్ అయితే నోటికి కొంచెం రుచిగా ఉంటుందని అలా చేస్తుంటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ లో ఆమ్లెట్ తినే వారిలో నగరవాసులే ఎక్కువ. ఉరుకుల పరుగుల జీవితం, టిఫిన్ చేసుకోవాలంటే బద్ధకం, బయట టిఫిన్ తినాలి అంటే భయం. అందుకే చాలామంది ఆమ్లెట్ కు జై కొడతారు. చాలామంది ఆమ్లెట్ తయారు చేయాలంటే సులభమైన పద్ధతిని అనుసరిస్తారు. గుడ్లు పగలగొట్టి సొన ను ఓ బౌల్లో పోసి, దానికి ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కలిపి గిలక్కొడతారు. అనంతరం పెనం మీద నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని దానిమీద పోసి.. అటూ ఇటూ కాల్చిన తర్వాత ఆస్వాదించుకుంటూ తింటారు.

    కానీ ఇంతటి సులభమైన విధానాన్ని కూడా ఓ ఇల్లాలు చాలా కష్టం అనుకుంది. తాను వేసిన ఆమ్లెట్ ను తిరిగేసేందుకు ఏకంగా దారాలను ఉపయోగించింది. చదువుతుంటే నవ్వొస్తుంది కదూ.. కాదు ఆమ్లెట్ పూర్తిగా కాలిన తర్వాత ఆమె ఆ దారాలు విప్పడం విశేషం. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఔత్సాహికుడు పోస్ట్ చేయగా ఏకంగా 5.3 కోట్ల మంది వీక్షించారు. వేలాదిమంది తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఈ వీడియో చూసేందుకు వినూత్నంగా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

    ఇక ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్లు పలు విధాలుగా స్పందించారు. ఆమ్లెట్ పెనం మీద కంటే దారాల మీద తయారు చేస్తే బాగుంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మీరు ఆమ్లెట్ తయారు చేశారు, నీకోసం నాసా ఎదురుచూస్తోంది, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారని మరో యూసర్ రాసుకొచ్చాడు. ఆమె తెలివైన మహిళనే.. మీరు మాత్రం అలా చేయకండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఎక్కడైనా చూశారా? లేదా సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావాలని ఇలా చేశారా? అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.