viral video
viral video : భయాన్ని కలిగించే వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా.. కాకపోతే భయం కలిగించే వీడియోల జాబితాలో దీనికి ప్రథమ స్థానం ఇవ్వచ్చు. చూస్తుంటే హాలీవుడ్ అడ్వెంచర్ సినిమా లాగా దర్శనమిస్తోంది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియోని చూసిన ప్రతి నెటిజన్ తమ భయానక అనుభూతిని సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.. అలా వెంటాడేందుకు వస్తున్న ఖడ్గమృగం.. ఒక్కసారిగా దాడి చేస్తే ఇంకేమైనా ఉందా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే..
Also Read : మ్యాచ్ లో మాత్రమే ప్రత్యర్థులు.. ఆ తర్వాత స్నేహితులు.. వీడియో వైరల్
జరసేపు అక్కడే ఉంటే..
మనదేశంలో ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam) లో ఎన్నో అభయారణ్యాలు ఉన్నాయి. అందులో మానస్ అనే అనే పేరుతో ఉన్న అభయారణ్యం ప్రత్యేకమైనది. ఇక్కడ ఖడ్గ మృగాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా ఖడ్గం మృగాలు శాంతంగా ఉంటాయి. వాటికి ఏదైనా ఆపద ఎదురైనా.. ప్రశాంతతకు భంగం కలిగినా ఏమాత్రం ఊరుకోవు. పైగా వాటి ముక్కు భాగంలో పదునైన ఖడ్గం ఉంటుంది. అది అత్యంత మందంగా ఉంటుంది. దానితో కనుక అవి పొడిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అంతటి సింహం కూడా ఒంటరిగా ఖడ్గమృగంపై దాడి చేయదు. పులి కూడా ఖడ్గ మృగాన్ని వేటాడాలంటే భయపడుతుంది. అయితే అస్సాం లోని మానస్ పేరుతో ఉన్న అభయారణ్యాన్ని సందర్శించడానికి కొంతమంది టూరిస్టులు వెళ్లారు. వెళ్లిన వాళ్ళు అడవిని చూసి రాక.. తమ కెమెరాలతో ఓ ఖడ్గమృగం ఏకాంతాన్ని భంగం చేశారు. ఇంకేముంది దానికి కోపం వచ్చింది. టూరిస్టుల వెంటపడింది. భయపడిన టూరిస్టులు తమ సఫారీ జీప్ లో ఎక్కి బతుకు జీవుడా అనుకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఆ ఖడ్గమృగం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా పరుగు తీసింది. సఫారీ జీప్ ను అనుసరించింది. దీంతో సఫారీ జీప్ తోలుతున్న వ్యక్తి స్పీడ్ ను మరింత పెంచాడు. ఖడ్గమృగం తన కాళ్లను మరింత వేగంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఒకానొక సందర్భంలో ఖడ్గం మృగం జీప్ ను ఢీ కొడుతుందనే భావన కలిగింది. అయితే అది కాస్త అలసిపోవడంతో టూరిస్టులు బతికిపోయారు. లేకపోతే ఖడ్గ మృగం చేతిలో చచ్చేవారే.
సోషల్ మీడియాలో సంచలనం
ఆ జీపు ముందు భాగంలో వెళ్తున్న ఓ వాహనంలో ఉన్న టూరిస్టులు ఈ దృశ్యాలను మొత్తం తమ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అది కాస్త సోషల్ మీడియాకు ఎక్కడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ ఘటన తర్వాత అభయారణ్యం అటవీశాఖ అధికారులు స్పందించారు. టూరిస్టులు అడవిలోని అందాలను చూడాలని.. తమ కెమెరాలలో బంధించుకోవాలని.. మృగాల ఏకాంతానికి భంగం కలిగిస్తే ఇలానే వ్యవహరిస్తాయని పేర్కొంటున్నారు.
Also Read : కూతురికి ప్రేమించిన వాడు కావాలి.. తండ్రికి కూతురు కావాలి.. వైరల్ వీడియో