వర్షంలో డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న సురేఖవాణి కూతురు

  ‘వర్షం’సినిమాలో తడుస్తూ వానలతో తడుస్తూ త్రిష ఆరబోసిన అందాలు ఇప్పటికీ కుర్రకారుకు మెలిపెడుతూనే ఉంటాయి. ఆ సినిమా అంత హిట్ అయ్యి త్రిషకు ప్రభాస్ కు అంత పేరు వచ్చిందంటే అలాంటి తడి అందాలే కారణం. ఇప్పుడు అదే త్రిష అందాలను రిపీట్ చేసి నటి కూతురు. హాట్ హాట్ గా వర్షంలో తడుస్తూ అందాలు ఆరబోసింది. ఆమె అందచందాల వీడియో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో అక్క, అత్త, చెల్లి క్యారెక్టర్లు చేసే నటి […]

Written By: NARESH, Updated On : June 4, 2021 1:01 pm
Follow us on

 

‘వర్షం’సినిమాలో తడుస్తూ వానలతో తడుస్తూ త్రిష ఆరబోసిన అందాలు ఇప్పటికీ కుర్రకారుకు మెలిపెడుతూనే ఉంటాయి. ఆ సినిమా అంత హిట్ అయ్యి త్రిషకు ప్రభాస్ కు అంత పేరు వచ్చిందంటే అలాంటి తడి అందాలే కారణం. ఇప్పుడు అదే త్రిష అందాలను రిపీట్ చేసి నటి కూతురు. హాట్ హాట్ గా వర్షంలో తడుస్తూ అందాలు ఆరబోసింది. ఆమె అందచందాల వీడియో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో అక్క, అత్త, చెల్లి క్యారెక్టర్లు చేసే నటి సురేఖవాణి గురించి అందరికీ తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సురేఖ వాణి ఇప్పుడు సోషల్ మీడియాలో సేదతీరుతోంది. యువతిలా మారిపోయి హాట్ ఫొటోలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెట్టింట్లో ఆమె అకౌంట్లకు లక్షల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం ఆమె వారితో తన విషయాలను పంచుకుంటూ తెగ సందడి చేస్తోంది. అలాగే లెటెస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఆమెతో పాటు ఆమె కూతురు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసబెట్టి వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది.

నటి సురేఖవాణి కూతురు తాజాగా సుప్రీత నాయుడు కొన్ని తాజాగా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వర్షంలో తడుస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ ను మించి ఆమె ఇన్ స్ట్రాగ్రాంలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సురేఖ వాణి అంతకుముందు తన కూతురుతో రకరకాల ఫోజుల పెట్టి దిగి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. తాజాగా సుప్రీత తన అందాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

సుప్రీత త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. అందుకు శిక్షణ తీసుకుంటుందని కొందరు ప్రచారం చేశారు. అయితే సురేఖవాణి మాత్రం అలాంటిదేమీ లేదని కరోనా సమయమైనందున ప్రస్తుతం ఎలాంటి ప్రయోగం చేయడం లేదని, ఆ తరువాత ఆలోచిస్తామని అంటోంది. సుప్రీత ఫోజులు చూస్తే త్వరలోనే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కవే ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. సుప్రీత ‘అరెరే మనసా’ అనే బ్యాక్ రౌండ్ సాంగ్లో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.