https://oktelugu.com/

అరె.. బాలయ్యను గుర్తించారు.. క్యూలో నిర్మాతలు !

‘నిర్మాత దిల్ రాజు’ అందరితో సినిమాలు చేశాడు గానీ, బాలయ్య బాబుతో మాత్రం ఇంతవరకు సినిమా చేయలేదు. సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్యది రెండో స్థానం. అయినా ఎందుకో బాలయ్య వైపు ఇన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు రాజు. నిజానికి, ‘అఖండ’ సినిమాని మొదట, దిల్ రాజు తన నిర్మాణంలో బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ బాలయ్య వరుస ప్లాప్ ల దెబ్బకు దిల్ రాజు బడ్జెట్ ఎక్కువ పెట్టడానికి […]

Written By:
  • admin
  • , Updated On : June 4, 2021 / 12:42 PM IST
    Follow us on

    ‘నిర్మాత దిల్ రాజు’ అందరితో సినిమాలు చేశాడు గానీ, బాలయ్య బాబుతో మాత్రం ఇంతవరకు సినిమా చేయలేదు. సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్యది రెండో స్థానం. అయినా ఎందుకో బాలయ్య వైపు ఇన్నాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు రాజు. నిజానికి, ‘అఖండ’ సినిమాని మొదట, దిల్ రాజు తన నిర్మాణంలో బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో చేయాలని ప్లాన్ చేశాడు.

    కానీ బాలయ్య వరుస ప్లాప్ ల దెబ్బకు దిల్ రాజు బడ్జెట్ ఎక్కువ పెట్టడానికి అప్పుడు ఆసక్తి చూపించలేదు. కానీ, బాలయ్యతో సినిమా చేయాలనే ఆలోచనను మాత్రం ఇంకా చంపుకున్నట్లు లేదు దిల్ రాజు. అందుకే బాలయ్యతో సినిమా చేయడానికి మరో ప్రయత్నం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దిల్ రాజు క్యాంప్ లోనే ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

    అయితే, గతంలోనే అనిల్ రావిపూడి, బాలయ్యకు ఒక కథ చెప్పాడు. ‘ఎఫ్ 3’ తరువాత ఆ కథనే సినిమాగా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడు అనిల్. ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు.. అనిల్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా రానున్న ఆ సినిమాని తానే నిర్మించే విధంగా ప్రస్తుతం బాలయ్య సన్నిహితులతో చర్చలు జరుపుతున్నాడు. దాదాపు ఈ కలయికలో సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

    మొత్తమ్మీద ‘అఖండ’ టీజర్ పుణ్యమా అని బాలయ్య క్రేజ్ ను రేంజ్ ను టాలీవుడ్ నిర్మాతలు గుర్తించారు. సరైన సినిమా పడితే, వంద కోట్లు వసూళ్లు చేసే కెపాసిటీ బాలయ్యకి ఇప్పటికీ ఉందని నిర్మాణ సంస్థలు కూడా పసిగట్టాయి. అందుకే, ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోన్న నిర్మాణ సంస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ తో దిల్ రాజు, సి. కళ్యాణ్ లాంటి నిర్మాతలు క్యూలో ఉన్నారు.