Viral news : సాధారణంగా ఒక చిత్రానికి గీయ్యాలంటే ఒక ఆర్టిస్టుకు ఎంతో నేర్పరితనం ఉండాలి. ముఖ్యంగా గీసే బొమ్మపై విపరీతమైన పట్టు ఉండాలి.. చేతుల్లో నైపుణ్యం ఉండాలి. అప్పుడే అతడు ఆర్టిస్టుగా రాణించగలడు. అయితే ఈ కథనంలో మీరు చదవబోయే ఆర్టిస్ట్ నేపథ్యం పూర్తి విభిన్నమైనది. ఎందుకంటే ఆమె ఒకేసారి రెండు చేతులతో.. రెండు కాళ్లతో బొమ్మలు గీస్తుంది. అవి అద్భుతంగా ఉంటాయి. అనన్య సామాన్యంగా కనిపిస్తుంటాయి. అలాగని ఆమేమీ పిచ్చి గీతలు గీయదు. అడ్డగోలుగా బొమ్మలు చిత్రీకరించదు. అవన్నీ కూడా ఎంతో హృద్యంగా.. ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అందువల్లే ఆమె అద్భుతమైన కళాకారిణిగా పేరు తెచ్చుకున్నది. మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రధానంగా కనిపిస్తోంది.
ఇంతకీ ఆమె ఎవరంటే..
డచ్ ప్రాంతానికి చెందిన “రాజసెన్న” అనే ఆర్టిస్టు ఉన్నది. ఈమెకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. అందువల్లే తనకిష్టమైన ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుంది.. ఆ తర్వాత క్రమక్రమంగా తనలో ఉన్న టాలెంట్ మొత్తం బయటపెట్టింది. సాధారణంగా ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే ఒక చేత్తో బొమ్మలు గీస్తారు. ఒకవేళ నైపుణ్యం ఎక్కువగా ఉంటే రెండు చేతులతో బొమ్మలు గీస్తారు. కానీ రాజ సెన్న మాత్రం అంతకుమించి అనే విధంగా బొమ్మలు గీస్తోంది. రెండు చేతులతో పాటు.. రెండు కాళ్ళతో కూడా బొమ్మలను అద్భుతంగా గీస్తోంది. ప్రస్తుతానికి ఈమెకు ఈ స్థాయిలో ఏకాగ్రత ఎలా సాధ్యమైందో తెలుసుకోవడానికి న్యూరాలజిస్టులు పరీక్షించారు. అయితే ఆమెలో ఐన్ స్టీన్ సిగ్నేచర్ ఉందని తెలిసింది. నల్లగొండ వారు ఒకేసారి ఎక్కువ విషయాలపై ఫోకస్ చేస్తారట.. రాజ సెన్న కూడా ఒకే సారి ఎక్కువ విషయాలపై ఫోకస్ చేసే నైపుణ్యం సొంతం చేసుకున్నాను. ” ఆమెను చూస్తే ముచ్చటేస్తోంది. మామూలుగా ఒక చేత్తో బొమ్మలు గీయడమే కష్టం అనుకుంటే.. ఆమె ఏకంగా రెండు చేతులతో.. రెండు కాళ్లతో బొమ్మలు గీస్తోంది. పైగా ఆ బొమ్మలు కూడా అత్యంత అందంగా ఉంటున్నాయి. ఏ మాత్రం వంక పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటున్నాయి. నిజంగా ఇంతటి గొప్ప టాలెంట్ పొందిన ఆమెకు నిజంగా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇలాంటి కళాకారిణి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని” న్యూరాలజిస్టులు అంటున్నారు.
గ్యాలరీ ఏర్పాటు చేసింది
రాజ సెన్న తను గీసిన బొమ్మలతో ఒక గ్యాలరీ ఏర్పాటు చేసింది. మామూలుగా అయితే కొంతమంది ఆర్టిస్టులు తమరు బొమ్మలను అలా అనే భద్రపరచుకుంటారు. కానీ ఈమె మాత్రం అద్భుతమైన చిత్రాలు గీస్తూ.. వాటిని గ్యాలరీలో ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నది. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నది. భవిష్యత్తులో తన చిత్రాలతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనేది ఆమె కల అని తెలుస్తోంది.
View this post on Instagram