Single Movie OTT : యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగిల్'(#Single Movie) ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకున్న ఈ చిత్రం మొదటి వారం లో 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ థియేటర్స్ లో స్టడీ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ చిత్రం. 8 వ రోజు దాదాపుగా 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు, రేపు చెరో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫుల్ రన్ లో ఎంత దూరం వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read : రజినీకాంత్ ‘కూలీ’ కారణంగా ‘వార్ 2’ కి కోట్ల రూపాయిల నష్టం జరగబోతుందా..?
ఈ నెల మొత్తం ఖాళీనే కాబట్టి, ఈ చిత్రానికి వచ్చే వారం వరకు మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో 20 కోట్ల షేర్ ని రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ఆ చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత విడుదల చెయ్యాలి. అంటే ఈ చిత్రం మే 9 న విడుదల అయ్యింది కాబట్టి, జూన్ 12 న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు టికెట్స్ దొరకని వాళ్ళు, సంతోషంగా ఈ చిత్రాన్ని ఇంట్లో కూర్చొని చూడవచ్చు.
ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతికా శర్మ, ఇవానా నటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇవానా నటనకు అయితే కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి ముందు ఆమె ‘లవ్ టుడే’ ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా అటు తమిళం లో, ఇటు తెలుగు లో పెద్ద హిట్ అయ్యింది. ఇలా వరుసగా ఇవానా యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే సినిమాలనే ఎక్కువ గా చేస్తూ వస్తుంది. ఇకపోతే థియేటర్స్ లో ఇంత అద్భుతంగా ఆడుతున్న ఈ సింగిల్ చిత్రం, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో గీతా ఆర్ట్స్ సంస్థ శ్రీవిష్ణు తో మరో సినిమా చేసేందుకు సిద్ధమైంది.