మంగళవారం సినిమా చూశారా. అందులో పాయల్ రాజ్ పుత్ విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంటుంది. ఆమెలో ఉన్న జన్యు లోపం కారణంగా విపరీతమైన లైంగిక వాంఛలు ఆమెలో కలుగుతాయి.. ఫలితంగా చాలా మంది తో ఆమె లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటుంది. చివరికి ఆమెను ఆ ఊరి వాళ్ళు హత్య చేస్తారు. తర్వాత ఆమె ప్రియుడు, ఇంకో డాక్టర్ కలిసి ఆ ఘాతుకానికి పాల్పడిన వారిని చంపేస్తారు. సరే అదంటే సినిమా స్టోరీ. సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి. కానీ నిజ జీవితంలో అలా ఉంటుందా? ఈ ప్రశ్నకు ఈ కథనమే సమాధానం.
ఆ యువతి పేరు నికోల్ (గూగుల్ నిబంధనల వల్ల పేరు మార్చాం). ఉండేది ఆస్ట్రేలియాలో.. వయసు 27 సంవత్సరాలు. ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నెలకు భారీగానే సంపాదిస్తున్నది. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందంగా ఉండటంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.. అయితే అలాంటి యువతి కి ఉన్న కోరిక మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేదే.. లైంగికంగా అత్యంత చురుకైన మహిళగా నికోల్ పేరుగాంచింది. గత ఏడాది 300 మంది యువకులతో ఆమె శారీరక సంబంధాన్ని నెరిపింది. ఆ విషయాన్ని ఆమె చెప్పుకోవడంలో ఎక్కడా ఇబ్బంది పడటం లేదు. పైగా నవ్వుతూ చెబుతోంది. ఈ ఏడాది రోజుకు ఒకరు చొప్పున 365 మంది యువకులతో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడమే తన లక్ష్యమని ఆమె అంటున్నది. ఇప్పటివరకు 70 మందితో తాను లైంగికంగా కలయికలో పాల్గొన్నట్టు సంచలన ప్రకటన చేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తాను ఏర్పరచుకున్న లక్ష్యానికి ముందే ఉన్నట్టు ఆమె చెప్పడం విశేషం.
ఇలా ఆ యువతి ఓపెన్ గా తన సంబంధాలను బయటపెడుతున్న నేపథ్యంలో చాలామంది యువకులు.. నాతో కూడా గడుపుతారా అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. వారందరికీ ఆమె రిప్లై ఇస్తుండడం విశేషం.. అయితే సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది ఇలా చేస్తుంటారని.. ఇలాంటి మాటలు నమ్మితే మోసపోవడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎవరూ ముక్కూ ముఖం తెలియని వారితో లైంగికంగా సంబంధం పెట్టుకోరని వ్యాఖ్యానిస్తున్నారు.. అలా ఇష్టానుసారంగా లైంగికంగా సంబంధాలు ఏర్పరచుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. కాగా, “నువ్వు చేస్తున్న పని నీ తల్లిదండ్రులకు తెలిస్తే.. ఏం చేస్తారో నని” ఓ నెటిజన్ ప్రశ్నిస్తే .. నికోల్ అతడిని బ్లాక్ చేసింది. ప్రస్తుతం నికోల్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.