Homeట్రెండింగ్ న్యూస్Vijay Sethupathi: విజయ్ సేతుపతి చేసిన ఈ పనికి అంతా ఫిదా

Vijay Sethupathi: విజయ్ సేతుపతి చేసిన ఈ పనికి అంతా ఫిదా

పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రెటీలు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంలో నడవలేని ఓ వృద్ధురాలు విజయ్ ను సెల్ఫీ కోరింది.

Vijay Sethupathi: తమిళ నటుడు హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హీరో విలన్ పాత్రల్లో మెరుస్తున్నారు. ఎంత పెద్ద హీరో అయినా సరే పెద్దలంటే అమితమైన గౌరవంగా ఉంటారు ఈ హీరో. ఎక్కడ పెద్ద వాళ్ళు కనిపించినా సరే వారికి పాదాభివందనం చేస్తుంటారు విజయ్. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

ఇప్పుడు హీరో విజయ్ సేతుపతి చేసిన ఒ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తమిళనాట లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈయన చేసిన పని మెప్పుకోలు గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా నిన్న తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారు. సెలబ్రెటీలు మాత్రమే కాదు ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.

పోలింగ్ కేంద్రాల్లో సెలబ్రెటీలు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంలో నడవలేని ఓ వృద్ధురాలు విజయ్ ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. అతను భవిష్యత్తులో ఇంకా మంచి ప్రాజెక్ట్ లు చేస్తారని చెప్పుకొచ్చింది కూడా. అప్పుడే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఆ వృద్ధురాలి తో సెల్ఫీ దిగారు.

సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు విజయ్. తల్లి లాంటి వ్యక్తి అని కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సందర్భంగా అక్కడున్న వారు తీసిన వీడియో కూడా తెగ వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండి. ఈ మధ్య విలన్ పాత్రల్లో మెప్పించిన విజయ్ ఇక నుంచి విలన్ పాత్రలను చేయనని గతంలోనే అన్నారు. మరి ముందు ముందు ఆయన సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper