Vijay : దశాబ్దాల పాటు కోలీవుడ్ ని ఏలిన స్టార్ హీరో రజినీకాంత్. ఆయనకు తమిళనాడులో అశేష అభిమానగణం ఉంది. ఎప్పటికైనా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు, సీఎం సీటు అధిరోహిస్తారని అభిమానులు భావించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు ఆయన రాజకీయ ప్రవేశం ప్రకటించారు. కానీ రజినీకాంత్ కి వయసు సహకరించలేదు. ఎనభై ఏళ్లకు దగ్గరపడుతున్న రజినీకాంత్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. దాంతో రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు. ఇది అభిమానులను తీవ్రంగా కలచివేసింది.