Liger Movie TRP Rating: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’..విజయ్ దేవరకొండ హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం పాపం విజయ్ దేవరకొండ మూడేళ్ళ శ్రమని వృథా చేసింది..విడుదలకు ముందు మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో జెండా పాటిస్తాను అంటూ చెప్పుకొని తిరిగిన విజయ్ దేవరకొండ..విడుదల తర్వాత మీడియా కి కూడా మొహం చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.

పూరి జగన్నాథ్ ని గుడ్డిగా నమ్మి చివరికి రెమ్యూనరేషన్ విషయం లో ఈడీ అధికారుల చేత కూడా విచారణ చేయించుకునే స్థితికి వచ్చాడు విజయ్ దేవరకొండ..పూరి జగన్నాథ్ మీద నమ్మకం తో లైగర్ విడుదలకు ముందు ‘జన గణ మన’ అనే సినిమా కమిట్ అయ్యాడు..కానీ లైగర్ ఫలితం చూసి వెంటనే ఆ చిత్రం లో నటించడానికి విరమించుకున్నాడు..ఇలా లైగర్ చిత్రం ఆయన కెరీర్ లో ఒక చేదు జ్ఞాపకం గా మిగిలిపోయింది.
అయితే లేటెస్ట్ గా ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చెయ్యగా పర్వాలేదు అనే రేంజ్ రేటింగ్స్ ని దక్కించుకుంది..ఈ చిత్రం మొదటి టెలికాస్ట్ కి దాదాపుగా 6.7 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు బార్క్ సంస్థ ప్రకటించింది..ఇది చాలా సినిమాలతో పోలిస్తే బెటర్ రేటింగ్ అని చెప్పొచ్చు..బాహుబలి వంటి సంచలనాత్మక విజయం తర్వాత ప్రభాస్ హీరో గా నటించిన ‘సాహూ’ చిత్రం మొదటి టెలికాస్ట్ కి కేవలం 5 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది.

అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసినా కూడా సరిగా రేటింగ్స్ రాలేదని..దానికంటే లైగర్ సినిమా రేటింగ్స్ చాలా బెటర్ అంటూ విశ్లేషకులు చెప్తున్న మాట..ఈ విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విజయ్ దేవరకొండ కి ప్రభాస్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అంటూ సోషల్ మీడియా కామెంట్స్ వినిపిస్తున్నాయి..ఇక ఈ సినిమా తర్వాత ఆయన ‘ఖుషి’ అనే చిత్రం లో నటిస్తున్నాడు..సమంత ఆరోగ్య దృష్ట్యా కొంతకాలం షూటింగ్ ని ఆపేయగా..సంక్రాంతి తర్వాత నుండి మళ్ళీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.