Kapu Reservations Issue : కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మరి దీనిపై జనసేన స్పందన ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏపీలో కాపులో 20 శాతానికి పైగా ఉన్నారు. వాళ్లకు ఒకనాడు ఉండి ఇవాళ రిజర్వేషన్లు తీసేయడం దారుణమనే చెప్పాలి. నీలం సంజీవరెడ్డి హయాంలో కాపులకు రిజర్వేషన్లు తొలగించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రయత్నం ఫలించడం లేదు. ఆ ఆశలు కూడా పోయాయి.
సుప్రీంకోర్టు 50శాతానికి మించకూడదని రిజర్వేషన్లకు ఆంక్షలు పెట్టడంతో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పించన్ల పెంపుతో కాపులకు మరోసారి ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ఈబీసీ 10శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు గత ప్రభుత్వంలో ఇచ్చిన 5శాతం రిజర్వేషన్ ను జగన్ ప్రభుత్వం తొలగించింది.
కాపులకు వైసీపీ అన్యాయం చేసిందన్న వాదన ఆ సామాజికవర్గంలో నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటన జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రాల్లోని సామాజికవర్గాల వారీగా ఇచ్చుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో వైసీపీ ఇరుకునపడింది. కాపులకు యాంటీగా వైసీపీ మారింది.
కాపు రిజర్వేషన్ల అంశం విషయంలో లోటుపాట్లు.. వైసీపీ ప్రభుత్వ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
