Vijay Devarakonda Boycott Liger : కొట్లాడుతా.. గుంటూరు అడ్డా మీద ‘లైగర్’ తో దేశానికి సవాల్ చేసిన విజయ్ దేవరకొండ?

Vijay Devarakonda Boycott Liger : గుంటూరు కారం ఎంతో ఫేమస్.. నషాళానికి అంటితే అంతే సంగతులు. ఇదే గుంటూరు లో హీరో విజయ్ దేవరకొండకు మండింది. తన కొత్త సినిమా ప్రమోషన్ కు వచ్చిన సందర్భంగా ‘బాయ్ కాట్ లైగర్’ అంటూ నినదిస్తున్న వారిని ఎదురించాడు. గుంటూరు అడ్డా నుంచే దేశానికి ఓ మెసేజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇటీవల కాలంలో దేశంలో హిందుత్వం, జాతీయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి హీరోల సినిమాలను ‘బాయ్ కాట్’ పేరుతో […]

Written By: NARESH, Updated On : August 21, 2022 9:06 am
Follow us on

Vijay Devarakonda Boycott Liger : గుంటూరు కారం ఎంతో ఫేమస్.. నషాళానికి అంటితే అంతే సంగతులు. ఇదే గుంటూరు లో హీరో విజయ్ దేవరకొండకు మండింది. తన కొత్త సినిమా ప్రమోషన్ కు వచ్చిన సందర్భంగా ‘బాయ్ కాట్ లైగర్’ అంటూ నినదిస్తున్న వారిని ఎదురించాడు. గుంటూరు అడ్డా నుంచే దేశానికి ఓ మెసేజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇటీవల కాలంలో దేశంలో హిందుత్వం, జాతీయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి హీరోల సినిమాలను ‘బాయ్ కాట్’ పేరుతో నెటిజన్లు ఆడనివ్వకుండా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇటీవల అగ్ర హీరో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ను కూడా ఇలానే బాయ్ కాట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. పాపం అమీర్ ఖాన్ వేడుకున్నా.. సారీ చెప్పినా.. తన సినిమాను వదిలేయాలని బ్రతిమిలాడినా కూడా వదలలేదు.

ఇప్పుడు లాల్ సింగ్ చద్దాకు మద్దతుగా మాట్లాడి అమీర్ కు సపోర్ట్ చేసినందుకు విజయ్ దేవరకొండ ‘లైగర్’ను బాయ్ కాట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గుంటూరులో ప్రమోషన్ కు వచ్చిన విజయ్ ను విలేకరులు అడిగినప్పుడు బరెస్ట్ అయ్యాడు. మన రౌడీ హీరో అమీర్ ఖాన్ లా బెండ్ అవ్వలేదు. తొడగొట్టాడు. బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వారితో తలపడుతానని.. కొట్లాడుతానని చెప్పి సంచలనం సృష్టించారు.

‘నేను హైదరాబాద్ లో పుట్టా.. చార్మి పంజాబ్ లో.. పూరి సర్ నర్సీపట్నంలో పుట్టారు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాం.. కంప్యూటర్ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్ కాదు మేము.. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే.. ఏది ఎదురొచ్చినా కొట్లాడడమే.. ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం.. ప్రేక్షకులు, ప్రజల ఆశీర్వాదం ఎవరూ ఏం చేయలేరు. ఒక అమ్మ.. తన బిడ్డను చాంపియన్ ను చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథను బాయ్ కాట్ చేస్తారా? ’ విజయ్ దేవరకొండ ప్రశ్నించారు. ‘బాయ్ కాట్ లైగర్’ అన్న వారితో పోరాడుతానని స్పష్టం చేశారు.

చాలా మంది హీరోలు తమ సినిమాపై ఇలాంటి పబ్లి సిటీ జరిగితే కాస్త బెండ్ అయ్యి వేడుకుంటారు. అమీర్ ఖాన్ నుంచి అందరూ ఇలా చేశారు. కానీ మన రౌడీ బాయ్ మాత్రం తొడగొట్టేశారు. దేశంలో ఒక వర్గానికి, ఒక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆడనివ్వని ఈ సమయంలో ఇలా మన విజయ్ దేవరకొండ గుంటూరు నుంచి దేశానికి ఈ సంచలన సవాల్ చేశారు. మరి ఈ బాయ్ కాట్ చేసేవాళ్లు ఇప్పటికైనా వదిలేస్తారా? విజయ్ తో పోరాడుతారా? అన్నది వేచిచూడాలి.