https://oktelugu.com/

Bloody Ishq Review: ‘బ్లడీ ఇష్క్’ ఫుల్ మూవీ రివ్యూ…

'బ్లడి ఇష్క్' అనే సినిమా థియేటర్ కోసం రెడీ అయినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం ఈ సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేశారు. ఇక శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : July 27, 2024 / 05:27 PM IST

    Bloody Ishq Movie Review

    Follow us on

    సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలను భారీ అంచనాలతో తెరకెక్కిస్తు ఉంటారు. అయితే అన్ని సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయాలని కొన్ని అంచనాలను పెట్టుకుంటారు. కానీ అనుకోని సందర్భాల వల్ల ఆ సినిమాలని ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందువల్ల ఓటిటిలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ కు అమ్మేసుకుంటారు. దానివల్ల ప్రొడ్యూసర్స్ గాని, దర్శకుడుగానీ అందరూ సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అలాంటి నేపథ్యంలోనే ‘బ్లడి ఇష్క్’ అనే సినిమా థియేటర్ కోసం రెడీ అయినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం ఈ సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేశారు. ఇక శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఐలాండ్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంటుంది. అక్కడ రోమేశ్ (వర్ధన్ పూరి), నేహా(అవికా గోర్) దంపతులు ఉంటారు. అయితే డే మొత్తం బాగానే ఉన్నా కూడా రాత్రి వేళ నేహా కి విపరీతమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక వాటి ద్వారా ఆమె తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ఉంటుంది. ఇక ఈ విషయాన్ని తన భర్త అయిన రోమేశ్ కి చెబుతుంది. అయినప్పటికీ ఆయన ఆ విషయాన్ని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటూ ఆమెని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. అయితే రోమేశ్ తన భార్యని ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి గల కారణం ఏంటి రోమేష్ వాళ్ళ నాన్న తన సెకండ్ వైఫ్ ని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె మర్డర్ ఎందుకు చేయబడింది. ఆ మర్డర్ కి రోమేశ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక మొదటి నుంచి కూడా ‘బ్లడీ ఇష్క్’ సినిమాని హార్రర్ సినిమాగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు. దానివల్ల ఈ సినిమా మీద కొద్దిపాటి అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక చివరి నిమిషంలో ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ కి తీసుకురావడం పట్ల మేకర్స్ ఒక బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అయినట్లుగా మనకు ఈజీగా తెలిసిపోతుంది. అయితే సినిమాలో కంటెంట్ పెద్దగా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయలేకపోయింది.అయినప్పటికీ ఈ సినిమాలో ఉన్న కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ మాత్రం ప్రేక్షకులను భయాందోళనలకు గురి చేస్తుంది. ఇక ఈ హార్రర్ సీన్స్ అంత బాగా రావడానికి నేపథ్య సంగీతం కీలక పాత్ర వహించింది. ఈ సినిమా మొత్తంలో కొన్ని సన్నివేశాలు సినిమా చూసే ప్రేక్షకుడిని భయపెడతాయనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ బట్ హర్రర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడంలో మాత్రం ఆయన చాలా వరకు తడబడ్డాడనే చెప్పాలి…

    ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న కపుల్స్ మధ్య నడిచే కథని హార్రర్ గా నేపథ్యం లో తీయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఈ సినిమా ఫెయిల్ అయినట్టుగా మనం భావించాలి. ఇక ఈ సినిమా థియేటర్ కు వస్తే సక్సెస్ అవ్వదు. అని ముందుగానే ఊహించిన మేకర్స్ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేసి ఒక మంచి పని చేశారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే హార్రర్ సినిమాగా వచ్చిన ఈ సినిమా హార్రర్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాల సాగడం ప్రేక్షకుడిని చాలా వరకు ఇబ్బందికి గురిచేస్తుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఒకటి రెండు ట్విస్టులను మినహాయిస్తే సినిమాలో పెద్దగా చూసే అంశాలైతే ఏమీ లేవనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో చేసిన ‘వర్ధన్ పూరి’ తన పాత్ర పరిధి మేరకు బాగా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఆయన ఈ సినిమాలో కొంతవరకు మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడనే చెప్పాలి… ఇక చిన్నారి పెళ్ళి కూతురుగా గుర్తింపు పొందిన ‘అవికా గోర్’ మరోసారి హార్రర్ సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకుణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ తను పోషించిన పాత్ర సినిమాకి హెల్ప్ అయింది. అయిన కూడా కథలో పెద్దగా విషయం లేకపోవడం వల్ల ఈ సినిమా అనేది చూసే ప్రేక్షకుడికి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. అలాగే జరగబోయే సీన్స్ ను ప్రేక్షకుడు ముందుగానే ఊహిస్తూ ఉంటాడు. దానివల్ల సినిమా మీద భారీ ఎఫెక్ట్ అయితే పడింది. ఇక అవికా గోర్ కొంతవరకు మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా స్టార్టింగ్ లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి తను కాపాడే ప్రయత్నం చేసిన కూడా అది సక్సెస్ అయితే అవ్వలేదు…

    టెక్నికల్ అంశాలు

    ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికొస్తే నేపథ్య సంగీతం కొంతవరకు అలరించినప్పటికీ మిగతా ఈ సినిమాకోసం మిగతా క్రాఫ్ట్ వాల్లెవ్వరు కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టినట్టుగా అయితే కనిపించలేదు. ఇక ఎడిటర్ కూడా ఏ సీను కట్ చేయాలి, ఏ సీను సినిమాలో ఉంచాలో తెలియక ఒక డైలామాలో ఉండి ఆ సినిమాకి ఎడిటింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ లో కూడా పెద్దగా కొత్తదనం అయితే ఏమీ కనిపించలేదు. అవే రెగ్యులర్ స్టడి షాట్స్, మూమెంట్ షాట్స్ తీస్తూ అక్కడక్కడ ట్రాలీ షాట్స్ ను కూడా వాడినట్టుగా కనిపిస్తుంది. అంతే తప్ప పెద్దగా హర్రర్ ని కొలిపే విధంగా విజువల్స్ అయితే లేవు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సో సో గానే ఉన్నాయనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్
    ట్విస్టులు

    మైనస్ పాయింట్స్

    కథ
    కథనం
    బోరింగ్ సీన్స్…

    రేటింగ్
    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5

    చివరి లైన్
    ఈ మాత్రం భయపెట్టలేని హార్రర్ సినిమా…