https://oktelugu.com/

Heroine Madhubala: ఆర్ ఆర్ ఆర్, బాహుబలి చిత్రాల్లో ఉందేంటీ? శాకుంతలంలో లేనిదేంటి?… హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు!

మధుబాల ఈ చిత్రంలో మేనక రోల్ చేశారు. ఆమె మాట్లాడుతూ... శాకుంతలం చిత్ర ఫలితం నిరాశపరిచింది. చాలా కష్టపడి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి అయ్యాక ఏడాది సమయం సీజీ వర్క్ చేశారు. నటులు, సాంకేతిక నిపుణుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించారు.

Written By:
  • Shiva
  • , Updated On : April 27, 2023 / 07:55 AM IST
    Follow us on

    Heroine Madhubala: సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది శాకుంతలం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు దారుణమైన ఫలితం అందుకుంది. శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో ఏప్రిల్ 14న విడుదల చేశారు. మొదటి షో నుండి శాకుంతలం చిత్రానికి నెగిటివ్ టాక్ నడిచింది. నాసిరకం గ్రాఫిక్స్, సీరియల్ ని తలపించే స్క్రీన్ ప్లే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. సమంత డబ్బింగ్ విమర్శల పాలైంది. తెలుగురాని సమంత గ్రాంథిక డైలాగ్స్ పలకడం జనాలు జీర్ణించుకోలేకపోయారు.

    మొత్తంగా శాకుంతలం రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన శాకుంతలం రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. నిర్మాత దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయారని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సమంత తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఈ చిత్ర పరాజయంపై సీనియర్ హీరోయిన్ మధుబాల కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు.

    మధుబాల ఈ చిత్రంలో మేనక రోల్ చేశారు. ఆమె మాట్లాడుతూ… శాకుంతలం చిత్ర ఫలితం నిరాశపరిచింది. చాలా కష్టపడి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి అయ్యాక ఏడాది సమయం సీజీ వర్క్ చేశారు. నటులు, సాంకేతిక నిపుణుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కానీ శాకుంతలం పరాజయం పొందింది. పురాణాల ఆధారంగా శాకుంతలం తెరకెక్కింది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు భారి విజయాలు నమోదు చేశాయి. అవి ఎందుకు ఆడాయో సరైన కారణం లేదు. శాకుంతలం ఫ్లాప్ అవుతుందని ఊహించలేదని, అన్నారు.

    ఆమె శాకుంతలం ఫలితాన్ని ప్రస్తావించే క్రమంలో రాజమౌళి చిత్రాలను తక్కువ చేసి మాట్లాడారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో ఉన్నదేంటి? శాకుంతలం చిత్రంలో లేనిదేంటీ? అన్నట్లు ఆమె వాదన ఉంది. ప్రేక్షుకుల తీర్పును గౌరవించకుండా ఆమె మాట్లాడారు. సినిమా బాగుంటే ముక్కూ మొహం తెలియని హీరోలను, దర్శకులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. బాగోకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా పట్టించుకోరు. ప్రేక్షకులకు నచ్చడం వలెనే ఆర్ ఆర్ ఆర్, బాహుబలి ఆడాయని ఆమె అర్థం చేసుకోవాలని పలువురి వాదన…