
Venu: సినిమాల్లో కమెడియన్ గా బాగా రాణిస్తున్న సమయం లోనే జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసి ‘వేణు వండర్స్’ టీం ద్వారా అద్భుతమైన స్కిట్స్ ని అందించిన వేణు అప్పట్లో జబర్దస్త్ ప్రోగ్రాం ని వీడి బయటకి రావడం పై సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి.’జబర్దస్త్’ యాజమాన్యం తో గొడవలు జరగడం వల్లే ఆ షో ని వీడి వచ్చేసాడని ఇలా ఒక వార్త అప్పట్లో జోరుగా ప్రచారం అయ్యింది.దీనిపై వేణు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘విబేధాల కారణంగానే జబర్దస్త్ షోని నేను వదిలేసాను అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.నా మెయిన్ కెరీర్ సినిమా, కేవలం సినిమాల కోసం మాత్రమే ఆ షో ని వదిలి బయటకి వచ్చాను.నేను ఉన్నన్ని రోజులు జబర్దస్త్ కి మంచి రేటింగ్స్ వచ్చేవి,నాకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఇచ్చేవారు’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు.
అయితే వేణు తన టీం ద్వారానే సుడిగాలి సుధీర్,ఆటో రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను వంటి వారికి అవకాశాలు ఇచ్చాడు.ఈ ముగ్గురు ఇప్పుడు ఇండస్ట్రీ లో ఏరేంజ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే.టాలీవుడ్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్స్ గా కొనసాగుతున్నారు వీళ్ళందరూ.అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత వేణుదే.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆయన డైరెక్టర్ గా మారి ‘బలగం’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం నేడు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.కేవలం కోటి రూపాయిల లోపే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు, డైరెక్టర్ గా కూడా వేణు ఇంత సక్సెస్ సాధించడంతో సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తుంది.